భారత విద్యార్థినికి 10 ఏళ్ళ యూఏఈ గోల్డెన్ వీసా
- May 30, 2021
యూఏఈ: భారత్ దేశానికి చెందిన విద్యార్థిని తస్నీమ్ అస్లమ్‌కు యూఏఈ గోల్డెన్ వీసా దక్కింది. ఎక్ససెప్షనల్ స్టూడెంట్ కేటగిరీలో తస్నీమ్ ఈ గోల్డెన్ వీసా దక్కించుకుంది.దీంతో ఆమెకు 10 ఏళ్ల పాటు అంటే 2031 వరకు యూఏఈలో నివాసం ఉండే అవకాశం ఏర్పడింది. ఇక తనకు దక్కిన ఈ అరుదైన గౌరవం పట్ల తస్నీమ్ ఆనందం వ్యక్తం చేసింది. ఇది తన జీవితంలోనే మరిచిపోలేని మధుర జ్ఞాపకంగా ఆమె పేర్కొంది. తాను చదువులో రాణించి, మెరిట్ సాధించడం వల్లే ఇదంతా సాధ్యమైందని తెలిపింది. తన పేరెంట్స్ సపోర్ట్ వల్లే తాను ఈ స్థాయికి చేరుకోగలిగానని పేర్కొంది. తస్నీమ్ షార్జాలోని అల్ ఖాసిమియా విశ్వవిద్యాలయం నుండి ఇస్లామిక్ షరియాను అభ్యసించింది. 72 దేశాల విద్యార్థులు గల తన క్లాస్‌లో ఆమె టాప్‌లో నిలిచింది.మొత్తం 4 గ్రేడ్ పాయింట్ యావరేజ్ (GPA)కు గాను తస్లీమ్ 3.94 సాధించడం విశేషం. అలాగే ఆమె షార్జా యూనివర్శిటీ నుంచి ఫిఖ్(ఇస్లామిక్ న్యాయ శాస్త్రం)లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పట్టా కూడా పొందింది.తస్లీమ్‌ది కేరళ రాష్ట్రంలోని అలప్పుజ జిల్లా. కూతురు సాధించిన ఈ ఘనత పట్ల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.
తస్నీమ్ తండ్రి ముహమ్మద్ అస్లాం షార్జా సిటీ మునిసిపాలిటీలో మాజీ ఉద్యోగి మరియు ఇప్పుడు ఎమిరేట్‌లో టైపింగ్ సెంటర్‌ను నడుపుతున్నారు.ఆమె తండ్రి వారి కుమార్తె యొక్క ప్రతిభకు చాల సంతోషం వ్యక్తం చేశారు.
తస్నీమ్ తండ్రి ముహమ్మద్ అస్లాం మాట్లాడుతూ... 'ఆమె సాధించిన విజయాల గురించి నేను గర్విస్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మా స్నేహితులు మరియు బంధువుల నుండి గత రెండు రోజులుగా అభినందన కాల్స్ మరియు సందేశాలు వచ్చాయి' అని తెలిపారు.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్‌చుక్ సంచలన పోస్ట్!







