కోవిడ్ రూల్స్ బ్రేక్..ఓ రెస్టారెంట్ సీజ్
- May 30, 2021
బహ్రెయిన్: కోవిడ్ రూల్స్ ను బ్రేక్ చేసిన ఓ రెస్టారెంట్ ను మూసివేసినట్లు హెల్త్ మినిస్ట్రీ ప్రకటించింది. దేశంలో సాధారణ పరిస్థితులను నెలకొల్పేందుకు నిబంధనలు సడలించిన నేషనల్ మెడికల్ టాస్క్ ఫోర్స్...కొన్ని షరతులతో ఇండోర్ డైనింగ్ సర్వీస్ కు అనుమతించిన విషయం తెలిసిందే. ప్రతి ఒక్కరికి టెంపరేచర్ చెక్ చేసి లోనికి అనుమతించాలని, టేబుల్..టేబుల్ కి మధ్య ఎడం పాటించాలి వంటి నిబంధనలతో డైనింగ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే..నిబంధనల అమలు తీరును పరిశీలించేందుకు హెల్త్ మినిస్ట్రి...అంతర్గత మంత్రిత్వ శాఖ, బహ్రెయిన్ పర్యాటక శాఖ అధికారులు సంయుక్తంగా సోదాలు నిర్వహించారు. మొత్తం 195 రెస్టారెంట్లలో తనిఖీలు నిర్వహించగా..27 చోట్ల నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు గుర్తించారు. అయితే..ఓ రెస్టారెంట్ నిర్వాహకులు మాత్రం తీవ్ర ఉల్లంఘనలకు పాల్పడినట్లు నిర్ధారణ కావటంతో ఆ రెస్టారెంట్ ను అధికారులు మూసివేశారు.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్‌చుక్ సంచలన పోస్ట్!







