సనద్ పేరుతో వాట్సాప్ ఆటో ఆన్సరింగ్ సర్వీస్
- June 01, 2021
కువైట్: నాణ్యమైన, వేగవంతమైన ప్రభుత్వ సేవలు అందించేందుకు కువైట్ అంతర్గత మంత్రిత్వశాఖ సనద్ పేరుతో వాట్సాప్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. 24349191 నెంబర్ ద్వారా పలు ప్రభుత్వ సేవలను పొందవచ్చని అంతర్గత మంత్రిత్వ శాఖలోని పౌర సంబంధాలు& సెక్యూరిటీ మీడియా విభాగం అధికారులు వివరించారు. ఒక్కో సేవకు సంబంధించి నిర్ధిష్టమైన కోడ్ మెను ఉంటుంది. మెనులోని కోడ్ ను టైప్ చేసి మెసేజ్ చేయగానే ఆటో ఆన్సరింగ్ సిస్టమ్ ద్వారా వినియోగదారులకు అవసరమైన వివరాలు, సేవలు పొందవచ్చు. ఎలక్ట్రానిక్ సర్వీసులకు-S, అంతర్గత మంత్రిత్వ శాఖ సేవలకు-T, జనరల్ ఎంక్వైరీస్-I కోడ్ ద్వారా సర్వీస్ పొందవచ్చు. అలాగే 1- ఉల్లంఘనలకు సంబంధించి ఫైన్ చెల్లింపులు, 2- రెసిడెన్సీ అఫైర్స్ సర్వీస్, 3- డ్రైవింగ్ లైసెన్స్ సర్వీస్, 4- పీపీటీ ప్లాట్ ఫాం, 5- డ్రైవింగ్ టెస్ట్ అపాయింట్మెంట్స్, 6- పర్సనల్ ఎంక్వైరీస్, 7- రీమైండ్ మీ సర్వీస్ లను పొందవచ్చు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- సౌదీలో అక్రమ నివాసితులపై ఉక్కుపాదం.. వారంలో దాదాపు 15 వేల మంది అరెస్ట్..!!
- అక్రమ బరువు తగ్గించే మందులపై యూఏఈ ఉక్కుపాదం..!!
- ఒమన్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక సంస్కరణలు..!!
- కువైట్‌లో కల్తీ చేపలపై ఫుడ్ అథారిటీ కొరడా..!!
- ఖతార్‌లో సముద్ర రవాణా సేవలు పునరుద్ధరణ..!!
- భారత్, బహ్రెయిన్ మధ్య న్యాయ సహకారానికి కొత్త దిశ..!!
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’







