దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అన్నింటా అగ్రగామిగా నిలిచింది:టి.హోం మంత్రి
- June 02, 2021
హైదరాబాద్: సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ ఆవరణలో బుధవారం నాడు నిర్వహించిన రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆయన ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించి, తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం మంత్రి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మహమూద్ అలీ మాట్లాడుతూ.... తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమ రంగాలలో అద్భుత ప్రగతి తో దేశంలోనే అగ్రగామిగా నిలిచిందన్నారు . రైతు సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత నిస్తుందని, కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో రాష్ట్రం సస్యశ్యామలం అయిందన్నారు. రైతులకు సాగునీరు, రైతు బంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత విద్యుత్తు అందిస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రైతులందరూ సంతోషంతో ఉన్నారని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణ వచ్చినప్పుడు లోటు విద్యుత్తు తో ఉన్న రాష్ట్రం ప్రస్తుతం విద్యుత్తు సర్ ప్లస్ లో ఉందన్నారు. లా అండ్ ఆర్డర్ లో తెలంగాణ పోలీస్ దేశంలో నెంబర్ వన్ గా ఉందన్నారు.
రాష్ట్రంలో వైద్య రంగాన్ని మరింత బలోపేతం చేస్తున్నామన్నారు. కరోనా కట్టడికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నదని తెలిపారు. రాష్ట్రంలో మరణాల రేటు తక్కువగా ఉందని,రికవరీ రేటు ఎక్కువగా ఉందని తెలిపారు.
పరిపాలనా సౌలభ్యం కోసం చిన్న జిల్లాలను ఏర్పాటు చేయడంతో ప్రజలకు మెరుగైన సేవలు అందుతున్నాయని అన్నారు. అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ బంగారు తెలంగాణ దిశగా రాష్ట్రం పరుగులిడుతుందన్నారు. ప్రజల సంక్షేమానికి సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వం నిరంతరం పాటుపడుతుందని మంత్రి అన్నారు.
కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో ప్రజలు తమ వంతు సహకారాన్ని అందించాలని ఆయన కోరారు. అంతకుముందు పోలీస్ ల గౌరవ వందనం స్వీకరించారు.
ఉత్తమ సేవలందించిన పోలీస్ శాఖ అధికారులు నలుగురికి సేవా పథకాలను అందించారు.
ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో మంత్రితో పాటు ఎంపీలు కొత్త ప్రభాకర్ రెడ్డి, బీబీ పాటిల్, జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ, జిల్లా కలెక్టర్ హనుమంతరావు, జిల్లా ఎస్పీ చంద్రశేఖర్రెడ్డి,అదనపు కలెక్టర్లు రాజర్షి షా, వీరారెడ్డి, డి సి ఎం ఎస్ చైర్మన్ శివ కుమార్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ నరహరి రెడ్డి, మాజీ శాసనసభ్యులు చింతా ప్రభాకర్, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్‌కు తొలి స్థానం..!!
- ఖతార్‌లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్‌లో భారీ వర్షాలు..!!
- ఇరాన్‌పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!
- దుబాయ్ డేట్ ఫెస్టివల్ లో పాల్గొనేవారికి Dh1 మిలియన్ గ్రాంట్..షేక్ హమ్దాన్ ఆదేశాలు..!!
- సౌదీ మరో ఘనత..అంతర్జాతీయ ఐఎస్ఓ కమిటీకి నేతృత్వం..!!
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్‌కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..







