పిల్లలకు కరోనా వస్తుందా??...క్లారిటీ ఇచ్చిన సీనియర్ పీడీయాట్రిషన్
- June 02, 2021కలిసికట్టుగా మూడో దశను అరికడదాం!
కోవిడ్ యొక్క స్వభావం..
– మహమ్మారి దశలవారీగా సంభవిస్తుంది. ప్రతి దశ అధిక సంఖ్యలో కేసులు నమోదవ్వడానికి కారణమవుతుంది.
– ఆఖరికి జనాభాలో ఎక్కువమందికి రోగ లక్షణాలు (సింప్టమెటిక్) లేదా లక్షణ లేకపోవడం(అసింప్టమెటిక్)తో కూడిన అంటువ్యాధుల ద్వారా రోగనిరోధకశక్తి పెరుగుతుంది. దాన్నే హెర్డ్ ఇమ్యూనిటీ అంటారు.
–కాలక్రమేణా వ్యాధి పూర్తిగా అంతరించుపోవచ్చు లేదా తక్కువ వ్యాప్తిరేటుతో సమాజంలో ఉండిపోవచ్చు.
ప్రస్తుతం ఉన్న మహమ్మారి స్వభావం..
–ఈ తీవ్రమైన వ్యాధి మొదటి దశలో వృద్ధులు, అప్పటికే ఆరోగ్య సమస్యలు ఉన్న వ్యక్తుల్లో సంభవించింది.
–ప్రస్తుతం ఉన్న రెండో దశలో ఎక్కువమంది 30–45 ఏళ్ల మధ్య వయసువారూ ఈ వ్యాధి బారిన పడుతున్నారు. అందులోనూ మునుపు ఎలాంటి ఆరోగ్య సమస్య లేనివారనీ ఈ వైరస్ ఇబ్బంది పెడుతోంది.
మహమ్మారి ముగిసిందా?
లేదు..! కొవిడ్ ప్రవర్తనను పూర్తిగా అర్థం చేసుకోకపోతే, మూడో దశ చాలా విస్తృతంగా మారే అవకాశం ఉంటుంది.
ఈ మూడో దశ ఎవరిపై ఎక్కువ ప్రభావం చూపుతుంది?
మూడో దశ సంభవిస్తే, కోవిడ్ కి రోగనిరోధకశక్తి తక్కువగా ఉండే అందరిపైనా ప్రభావం చూపుతుంది.ఇంతకుముందు కోవిడ్ భారిన పడనివాళ్ళు మరియు కోవిడ్ వాక్సిన్ తీసుకోనివారిపై ఎక్కువ ప్రభావం చూపుతుంది . అందులో పిల్లలు కూడా ఉండవచ్చు . 18 సంవత్సరాల పైబడిన వారందరిని వాక్సిన్ తప్పనిసరిగా తీసుకోమని విజ్ఞప్తి
పిల్లలు ఏ స్థాయిలో వ్యాధి బారినపడే అవకాశం ఉంది ?
అదృష్టవశాత్తూ అనేక కారణాల వల్ల పిల్లలు ఇప్పటివరకూ చాలా తక్కువ సంఖ్యలోనే వ్యాధి బారినపడ్డారు. వైరస్ శరీరంలోకి చేరడానికి, స్పెషల్ రిసెప్టార్లు తక్కువ వ్యక్తీకరణ అందుకు ముఖ్య కారణం. అందులోనూ తక్కువమంది పిల్లలకే తీవ్రమైన లక్షణాలు కనిపించాయి.
ఈ మహమ్మారి వ్యాప్తి సమయంలో తల్లిదండ్రుల పాత్ర ఏమిటి?
–ఇన్ఫెక్షన్ సంగతి పక్కనబెడితే, తల్లిదండ్రులు తమ పిల్లల మానసిక ఆరోగ్య సమస్యలపై జాగ్రత్త వహించాలి.
–పిల్లలపై వేధింపులు, హింసను నివారించడంపై నిఘా పెట్టాలి.
–స్క్రీన్ టైమ్‌ని పరిమితం చేయడంతో పాటు మార్గదర్శకాల ప్రకారం పిల్లలను స్కూళ్ల రీఓపెన్ తర్వాత సురక్షితంగా పంపేందుకు సన్నద్ధమవ్వాలి.
–వైరస్ బారినపడ్డ దాదాపు 85–90శాతం మంది పిల్లల్లో తేలికపాటి, లక్షణరహితమైన కేసులే ఎక్కువగా ఉన్నాయి. పిల్లల్లో వ్యాధి తీవ్రంగా మారిన సందర్భాలు చాలా తక్కువ.
కోవిడ్ ఇన్ఫెక్షన్ పిల్లలో తీవ్రంగా ఉంటుందా ?
–న్యుమోనియా, మల్టీ సిస్టమ్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ (MIS-C) వంటి కొవిడ్–19 సంబంధిత తీవ్రమైన అనారోగ్యం పిల్లలలో సంభవిస్తుంది.
–పెద్దలతో పోలిస్తే పిల్లల్లో కొవిడ్ న్యుమోనియా తక్కువగా ఉంటుంది.
–MIS-C లోనూ కొన్ని సందర్భాలో, లక్షణాలు లేని లేదా లక్షణాలతో కొవిడ్–19 ఇన్ఫెక్షన్ బారినపడ్డ 2–6 వారాల తర్వాత కూడా కొందరిలో ఇమ్యూన్ డిస్‌రెగ్యులేషన్ ఉంటోంది. అయితే అది లక్షమంది జనాభాలో దాదాపు పన్నెండు కేసులు మాత్రమే ఉంటున్నాయి. అందులో కొన్ని కేసులు మాత్రం తీవ్రంగా మారుతున్నాయి. ఈ సమస్యను త్వరగా గుర్తిస్తే సరైన చికిత్స అందించొచ్చు. దాదాపు అన్ని కేసుల్లోనూ MIS-C సమస్యతో ఉన్న పిల్లల నుంచి ఇన్ఫెక్షన్ ఇతరులకు వ్యాప్తి చెందట్లేదు.
మూడో దశ వచ్చి పిల్లలపై ప్రభావం చూపించే ఆస్కారం ఉంటే, దానికి ఎలా సన్నద్ధమవ్వాలి?
–చాలామంది బాధిత పిల్లలు జ్వరం వంటి సాధారణ లక్షణాలతో ఇబ్బంది పడొచ్చు. అందువల్ల ఇంట్లోనే పర్యవేక్షణతో కూడిన సంరక్షణ అవసరం.
–పిల్లల్లో కొవిడ్ ప్రభావం విషయంలో మార్గదర్శకాలు ఉన్నాయి. అలాగే కొవిడ్ నిర్వహణ విషయంలో పీడియాట్రిషియన్లు కూడా ట్రైనింగ్ తీసుకొని ఉన్నారు.
–పెద్ద సంఖ్యలో తల్లితండ్రులు డాక్టర్లను సంప్రదించే ఆస్కారం ఉంది. అన్ని హాస్పిటల్స్ పెద్ద సంఖ్యల్లో ఆలస్యం జరగకుండా అన్నీ సిద్ధంగా ఉండాలి. అలాగే వ్యాధి లక్షణాలు, అనారోగ్యానికి సంబంధించి తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలి. పిల్లలకోసం మరిన్ని హై డిపెండెన్సీ యూనిట్ (హెచ్‌డీయూ), ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)తో కూడిన ప్రత్యేకంగా కొవిడ్ వార్డుల ఏర్పాటు జరగాలి.
–పిల్లలు కూడా పెద్దలు తీసుకుంటున్న జాగ్రతలే పాటించాలి. అందుకోసం పెద్దలు తప్పకుండా మాస్క్ ధరించడం, చేతులు శుభ్రం చేసుకోవడం. భౌతిక దూరం పాటించడం వంటివి పాటిస్తూ పిల్లలకు ఆదర్శంగా నిలవాలి. రెండేళ్ల నుంచి ఐదేళ్ల వయసు పిల్లలకు మాస్క్ పెట్టుకోవడంలో ట్రైనింగ్ ఇవ్వాలి.
–మూడో దశలో కొవిడ్ బారినపడ్డ అందరు పిల్లలకూ వ్యాధి తీవ్రంగా మారుతుందనడానికి ఎలాంటి ఆధారాలు లేవు.
–కొన్ని దేశాల్లో 12 - 18 సంవత్సరాల వయసు పిల్లలకు వాక్సిన్ అందుబాటులో ఉంది.
–భారతదేశంలో తయారు చేసిన వ్యాక్సిన్లను త్వరలో పిల్లలపై ట్రయల్స్ జరపనున్నారు. ఒకవేళ అది రోగనిరోధకశక్తి పెంచుతూ సురక్షితమని తేలితే, పిల్లల్లో వేగంగా మాస్ వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభిస్తారు.
మూడో దశ వచ్చే అవకాశం అయితే ఉంది. కానీ అది ఏ స్థాయిలో, ఎప్పుడు వస్తుందన్న విషయాలను ఊహించడం కష్టం. కానీ, కేవలం పిల్లలపైనే ఎక్కువ ప్రభావితం చేసే అవకాశం మాత్రం లేదు. అందువల్ల భయాందోళనలకు గురవ్వడానికి కారణం లేదు.
లోకోక్తి – అంతా మంచే జరుగుతుందని నమ్మకం పెట్టుకోవడంతో పాటు అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడానికీ సంసిద్ధంగా ఉండాలి.
డా. రవీందర్ రెడ్డి పరిగె
సీనియర్ పీడీయాట్రిషన్ అండ్ నియోనాటాలజిస్ట్
మెడికవర్ ఉమన్ & చైల్డ్ హాస్పిటల్స్
తాజా వార్తలు
- షార్ట్స్‌లో వీడియోల నిడివిని పెంచిన యూట్యూబ్
- కాంగో పడవ ప్రమాదంలో 78 మంది జల సమాధి
- రేపటి నుంచి భారత్–బంగ్లా టీ20 టిక్కెట్ల విక్రయం
- తిరుమల తిరుపతి శ్రీవారికి చంద్రబాబు దంపతులు పట్టు వస్త్రాలు
- ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య వైరం ఏమిటి? ఎందుకు?
- ఇండియాకు పన్నెండు ఐఫోన్ 16 తీసుకొస్తూ.. పట్టుబడ్డ ప్రయాణికులు..!!
- అబుదాబిలో వేటాడుతూ.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ వేటగాళ్లు..!!
- సౌదీ అరేబియాలో ఇన్‌బౌండ్ విజిటర్స్ వ్యయంలో 8.2% వృద్ధి..!!
- GCC-IMF సమావేశం.. ‘ఎకనామిక్స్ ఛాలెంజెస్’పై కీలక సమీక్ష..
- ఎక్స్పో సిటీ దుబాయ్.. మాస్టర్ ప్లాన్‌కు షేక్ మహమ్మద్ ఆమోదం..!!