విజయవాడలో పాస్‌పోర్టు సేవలు పునః ప్రారంభం
- June 03, 2021
అమరావతి: విజయవాడ లో పాస్‌పోర్టు సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి.నగరంలోని రీజియిన్ పాస్‌పోర్టు కేంద్రం పరిధిలో కోవిడ్ నిబంధనలను అనుసరించి పాస్‌పోర్టు సేవలను అధికారులు ప్రారంభించారు.అత్యవసరమైన వారికి సేవలందించాలన్న లక్ష్యంతోనే రోజుకు 3 గంటల మేర సేవలందించాలని నిర్ణయించారు.సాధారణ సమయంలో రోజూ సగటున 250 వరకు పాస్‌పోర్టు దరఖాస్తులను పరిశీలిస్తుంటారు.ప్రస్తుత కోవిడ్ పరిస్థితులలో ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు మాత్రమే కార్యాలయం పనిచేస్తుంది.కోవిడ్ నిబంధనలను అనుసరించి ప్రతి రోజూ చాలా తక్కువ సంఖ్యలోనే స్లాట్స్ కల్పించాలని అధికారులు నిర్ణయించారు. అత్యవసరమైతేనే దరఖాస్తు చేసుకోవాల్సిందిగా రీజనల్ పాస్‌పోర్టు ఆఫీసర్ శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్‌చుక్ సంచలన పోస్ట్!







