నకిలీ స్పేర్ పార్ట్స్ అమ్ముతున్న ఐదుగురు అరెస్ట్
- June 04, 2021
బహ్రెయిన్: అచ్చం ఒరిజినల్ స్పేర్ పార్ట్స్ ప్యాకింగ్ తో నకిలీ స్పేర్ అమ్ముతున్న ఐదుగురు వ్యక్తుల్ని బహ్రెయిన్ పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టైన వారిలో ఇద్దరు ఓనర్లు, ముగ్గురు ఉద్యోగులు ఉన్నారు. నిందితులకు చెందిన ట్రేడింగ్ కంపెనీని, స్పెర్ పార్ట్స్ గోడౌన్ తమ నకిలీ దందాకు వినియోగిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. నాసిరకం స్పేర్ పార్ట్ లను ఒరజినల్ స్పేర్ పార్టులు ప్యాక్ చేసే బాక్సులలో ప్యాక్ చేసి వాటిని ఒరిజినల్ విడి భాగాలుగా మార్కెట్ చేస్తున్నట్లు తెలిపారు. అంతేకాదు..వినియోగదారులు గుర్తించకుండా ప్యాకింగ్ కు ప్రత్యేకంగా కంప్యూటర్ బార్ కోడ్ లను కూడా రూపొందించినట్లు విచారణలో తేలింది. ఇండస్ట్రీ, కామర్స్&టూరిజం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సాధారణంగా నిర్వహించే తనిఖీల్లో ఈ నకిలీగాళ్ల బాగోతం వెలుగులోకి వచ్చింది. అరెస్టైన ఐదుగురిని వారం పాటు జైలుకు తరలించాలని కోర్టు ఆదేశించింది. ఈ కేసులో తదుపరి విచారణ కొనసాగుతున్నట్లు అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు