ఫ్లోటింగ్ రెస్టారెంట్ మునక: రక్షించిన దుబాయ్ పోలీస్
- June 04, 2021
దుబాయ్: డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ డిఫెన్స్ అలాగే దుబాయ్ మునిసిపాలిటీ సహకారంతో దుబాయ్ పోలీస్, మునిగిపోతున్న ఫ్లోటింగ్ రెస్టారెంటుని కాపాడేందుకు ప్రయత్నించడం జరిగింది. ఫ్లోటింగ్ రెస్టారెంట్ యజమాని దుబాయ్ పోలీస్ కంట్రోల్ రూంకి ఫోన్ చేసి ప్రమాదంపై సమాచారమిచ్చారని అధికారులు తెలిపారు. దుబాయ్ పోలీస్ మెరిటైమ్ రెస్క్యూ డిపార్టుమెంట్ అలాగే సివిల్ డిఫెన్స్ మేరీటైమ్ ఫైర్ మరియు రెస్క్యూ డిపార్టుమెంట్ సంయుక్తంగా సంఘటనా స్థలానికి హుటాహుటిన తరలి వెళ్ళి సహాయక చర్యలు ముమ్మరం చేశాయి. దుబాయ్ పోలీస్ డైవర్లు వెంటనే వెసెల్ కిందికి వెళ్ళి హోయిస్ట్ రోప్ (క్రేన్ సంబంధిత) తగిలించారు. అనంతరం షిప్ బ్యాలెన్స్ అయ్యేసరికి, వెంటనే బోటులోని నీళ్ళను తొలగించడం జరిగింది. బోట్ ఓనర్లు పూర్తిస్థాయి భద్రతా ప్రమాణాలు పాటించాలని ఈ సందర్భంగా లెఫ్టినెంట్ కల్నల్ అల్ నక్బి చెప్పారు.
తాజా వార్తలు
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం