కొనసాగుతున్న జల్లాక్, బాల్కీస్ స్కూళ్ళ నిర్వహణ పనులు: వర్క్స్ మినిస్ట్రీ
- June 04, 2021
బహ్రెయిన్: జల్లాక్ ఎలిమెంటరీ ప్రిపరేటరీ స్కూల్ (బాయ్స్), బల్కీస్ ప్రైమరీ స్కూల్ (గర్ల్స్) నిర్వహణ పనులు కొనసాగుతున్నట్లు మినిస్ట్రీ ఆఫ్ వర్క్స్ మునిసిపాలిటీ ఎఫైర్స్ మరియు అర్బన్ ప్లానింగ్ ఓ ప్రకటనలో పేర్కొంది. బిడ్లను టెండర్ బోర్డు ఎవాల్యుయేట్ చేస్తోందనీ, టెండర్లు ఏప్రిల్ 29న ప్రారంభమై బుధవారం ముగిశాయని మినిస్ట్రీ తెలిపింది. ఆరు కంపెనీలు టెండర్లలో పాల్గొన్నాయి. 288,200.000 అలాగే 347,270.000 బహ్రెయినీ దినార్ల మధ్య టెండర్లు నమోదయ్యాయి. సంబంధిత ప్రమాణాలకు అనుగుణంగా అప్లయ్ చేసిన లోయెస్ట్ బిడ్డర్ పనులను దక్కించుకోనున్నారు. సివిల్ మరియు స్ట్రక్చరల్ నిర్వహణ పనులు అలాగే లోపల మరియు బయట రంగులు వేయడం, సీలింగ్ రిపెయిర్లు, ఫ్లోరింగ్స్, తలుపులు, కిటికీలను మార్చడం.. ఇలా పలు రకాల నిర్వహణ పనులు చేయాల్సి వుంటుంది. వాటర్ నెట్వర్క్, వాటర్ ట్యాంకుల మార్పిడి వంటి పనులూ జరుగుతాయి. 40 పబ్లిక్ స్కూళ్ళలో పనులు పూర్తి చేయాల్సి వుందని మినిస్ట్రీ వెల్లడించింది.
తాజా వార్తలు
- Asia Cup 2025: Gautam Gambhir changes handshake protocol after Pakistan match
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!