విదేశీయుల వీసా గడువు పొడిగింపు
- June 04, 2021
న్యూ ఢిల్లీ: కరోనా మహమ్మారి విజృంభణతో కట్టడి చర్యలు చేపట్టాయి ఆయా ప్రభుత్వాలు.దీంతో లాక్డౌన్ కారణంగా కొన్ని ప్రత్యేక విమానాలు తప్పితే.. రెగ్యులర్ సర్వీసులు నడిచే పరిస్థితి లేదు.దీంతో.. భారత్లో విదేశీయులు చిక్కుకుపోయారు.. వారిలో కొందరి వీసాల గడువు కూడా ముగిసిపోయింది.దీంతో.. కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది.విదేశీయుల వీసాల చెల్లుబాటు గడువును ఆగస్టు 31వ తేదీ వరకు పొడిగించింది.ఈ మేరకు కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీచేసింది.దీంతో.. విదేశీయులు వీసాల గడువు పొడిగింపు కోసం మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.వీసాల గడువు దాటినా..ఎలాంటి జరిమానాలు లేకుండా ఆగస్టు 31వ తేదీ వరకు చెల్లుబాటు కానున్నట్టు పేర్కొంది.కాగా, లాక్డౌన్ కారణంగా భారతీయులు సైతం విదేశాల్లో చిక్కుకుపోయారు.వారిని స్వదేశానికి రప్పించేందుకు ప్రత్యేక విమానాలను నడుపుతోన్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం