ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీ

- June 04, 2021 , by Maagulf
ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీ

అమరావతి: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పెద్ద సంఖ్య‌లో ఐఏఎస్ అధికారుల‌ను బ‌దిలీ చేసింది ప్ర‌భుత్వం… మొత్తం 20 మంది ఐఏఎస్ అధికారుల‌ను బ‌దిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి  ప్ర‌భుత్వం.. వీరిలో క‌లెక్ట‌ర్లు.. పెద్ద సంఖ్య‌లో జాయింట్ క‌లెక్ట‌ర్లు ఉన్నారు.ఇక‌, ఇవాళ ఏపీ ప్ర‌భుత్వం బ‌దిలీ చేసిన ఐఏఎస్ అధికారుల వివ‌రాలు ప‌రిశీలిస్తే..

శ్రీకాకుళం కలెక్టర్‌ జె.నివాస్‌ బదిలీ.. ఆయ‌న స్థానంలో ఎల్‌.ఎస్‌.బాలాజీరావు 
అనంతపురం కలెక్టర్‌ గంధం చంద్రుడు బదిలీ.. ఆయ‌న స్థానంలో నాగలక్ష్మి
కృష్ణా జిల్లా కలెక్టర్‌గా జె.నివాస్‌ 
పాడేరు ఐటీడీఏ ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌గా రోనకి గోపాలకృష్ణ 
కడప జిల్లా జాయింట్‌ కలెక్టర్‌గా ధ్యానచంద్ర 
తూర్పు గోదావ‌రి జిల్లా జాయింట్‌ కలెక్టర్‌గా జాహ్నవి 
పశ్చిమగోదావరి జాయింట్‌ కలెక్టర్‌గా ధనుంజయ్‌ 
విశాఖ జాయింట్‌ కలెక్టర్‌గా కల్పనా కుమారి 
విజయనగరం జాయింట్‌ కలెక్టర్‌గా మయూర్‌ అశోక్‌ 
కర్నూలు జాయింట్‌ కలెక్టర్‌గా ఎన్‌.మౌర్య
చిత్తూరు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌గా వెంకటేశ్వర్ 
అనంతపురం జిల్లా జాయింట్‌ కలెక్టర్‌గా టి.నిశాంతి 
కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్‌గా ఎస్‌.ఎన్‌.అజయ్‌కుమార్‌ 
గుంటూరు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌గా అనుపమా అంజలి 
ప్రకాశం జిల్లా జాయింట్‌ కలెక్టర్‌గా విశ్వనాథం
నెల్లూరు జాయింట్‌ కలెక్టర్‌గా విదేహ్‌ కేర్‌ 
శ్రీకాకుళం జాయింట్‌ కలెక్టర్‌గా హిమాన్షు కౌశిక్‌ 
ఏపీ ఆగ్రోస్‌ ఎండీగా ఎస్‌.కృష్ణమూర్తి 
గ్రామ వార్డు సెక్రటరీ డైరెక్టర్‌గా గంధం చంద్రుడును 
మైనార్టీ సంక్షేమ శాఖ ప్ర‌త్యేక కార్య‌ద‌ర్శిగా ఇంతియాజ్ నియ‌మించింది ప్ర‌భుత్వం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com