14 నెలల తర్వాత ఇండియన్ షిప్ సిబ్బందికి విముక్తి
- June 05, 2021
కువైట్ సిటీ: న్యాయపరమైన చిక్కులతో 14 నెలలుగా కువైట్ లోనే చిక్కుకుపోయిన ఇండియన్ షిప్ సిబ్బందికి ఎట్టకేలకు విముక్తి లభించింది. మానవదృక్పథంతో కువైట్ చూపించిన చొరవ ఫలితంగా ఇండియన్ షిప్ సిబ్బంది సొంత దేశానికి పయనమయ్యారు.సిబ్బంది తిరుగు ప్రయాణానికి కువైట్ ప్రజా వ్యవహారాల శాఖ, సమాచార & ఐటీ శాఖ మంత్రి డాక్టర్ రన అల్ ఫరిస్ చేసిన కృషిని కువైట్లోని భారత రాయబారి సిబి జార్జ్ ప్రశంసించారు. ఆమె చేసిన సాయానికి ధన్యవాదాలు తెలిపారు.14 నెలలు క్రితం ఇండియాకు చెందిన షిప్ ULA సిబ్బంది న్యాయపరమైన చిక్కులతో సౌబా పోర్టులో చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. అయితే..డాక్టర్ అల్ ఫరిస్ వ్యక్తిగత చొరవ తీసుకొని సమస్యను పరిష్కరించారని సిబి జార్జ్ వివరించారు. కువైట్ లోకల్, ఇంటర్నేషనల్ అధికారులతో మాట్లాడి సంక్షోభానికి మూడు నెలల్లో ముగింపు పలికారని కొనియాడారు.దీంతో భారత నౌనకు చెందిన సిబ్బంది 14 నెలల తర్వాత కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నుంచి సొంత దేశానికి పయనమయ్యారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు …
- షార్జా రాజ కుటుంబంలో విషాదం
- ఇబ్రిలో ట్రక్కులో ఆకస్మికంగా మంటలు..!!
- ఐఫోన్ కొంటున్నారా? నకిలీ ఇన్స్టాగ్రామ్ స్టోర్లపై వార్నింగ్..!!
- ఖతార్ చాంబర్, భారత వ్యాపార ప్రతినిధి బృందం చర్చలు..!!
- సౌదీలో పెరిగిన నిర్మాణ వ్యయ సూచికలు..!!
- అడ్వాన్స్డ్ AI టెక్నాలజీలతో స్మార్ట్ సెక్యూరిటీ పెట్రోల్స్..!!
- బంగ్లాదేశీయులపై యూఏఈ వీసా నిషేధం? నిజమెంత?
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..