హాస్య కథానాయకుడు నరేశ్ డాక్టర్ అయ్యారు!
- March 06, 2016
ప్రస్తుతం క్యారెక్టర్ నటుడిగా బిజీగా ఉన్న ఒకప్పటి హాస్య కథానాయకుడు నరేశ్ డాక్టర్ అయ్యారు. అమెరికాలోని అకాడమీ ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ ఆయనకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. ఈ సందర్భంగా నరేశ్ మాట్లాడుతూ దక్షిణాదిన తనకు, కర్ణాటకకు చెందిన ఓ నృత్య కళాకారిణికి డాక్టరేట్ ఇచ్చారని తెలిపారు. తనకు నటనలో ఓనమాలు నేర్పిన జంధ్యాల, విజయ నిర్మల, కృష్ణ, తెలుగు సినీ ప్రేక్షకులకు ఈ డాక్టరేట్ అంకితం చేస్తున్నట్లు నరేశ్ చెప్పారు.ఇటీవలే తెలంగాణ స్పీకర్ మధుసూదనాచారి చేతుల మీదుగా తాను నవరసరాయ అనే బిరుదును అందుకున్నానని, అదే సమయంలో ఈ డాక్టరేట్ కూడా అందుకోవడం మరింత ఆనందంగా ఉందని అన్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







