బ్యాంకు ఉద్యోగులకు వ్యాక్సినేషన్‌: సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌

- June 05, 2021 , by Maagulf
బ్యాంకు ఉద్యోగులకు వ్యాక్సినేషన్‌: సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు అన్ని బ్యాంకుల్లో అధికారులు, సిబ్బందికి ప్రత్యేక వ్యాక్సినేషన్‌ కార్యక్రమం చేపడతామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. వారం రోజుల్లో బ్యాంకు అధికారులు, సిబ్బందికి వ్యాక్సినేషన్‌ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ప్రతి పౌరునికి టీకా అందించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారని పేర్కొన్నారు. అక్టోబర్‌ లోపు వ్యాక్సినేషన్‌ ప్రక్రియ పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టామని వివరించారు.

బ్యాంకు ఉద్యోగులకు ప్రత్యేక టీకా డ్రైవ్‌పై బీఆర్‌కేఆర్‌ భవన్‌లో వివిధ బ్యాంకుల ప్రతినిధులతో ఇవాళ సమావేశం నిర్వహించారు. ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులతో సహా అన్ని బ్యాంకు ఉద్యోగులకు వచ్చే వారంలోగా వ్యాక్సిన్‌ వేసేలా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com