తెలంగాణలో 2,00,000 మందికి వ్యాక్సినేషన్ అందించిన అపోలో హాస్పిటల్స్

- June 05, 2021 , by Maagulf
తెలంగాణలో 2,00,000 మందికి వ్యాక్సినేషన్ అందించిన అపోలో హాస్పిటల్స్

హైదరాబాద్: తెలంగాణ ప్రజలకు వ్యాక్సిన్లు వేయాలని అపోలో హాస్పిటల్స్ చేపట్టిన డ్రైవ్ ఒక ముఖ్యమైన మైలురాయిని తాకింది,ఇప్పటివరకు 2,00,000 మందికి వ్యాక్సిన్ లు వేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వానికి మరియు తెలంగాణ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడంలో తన నిబద్ధతను చాటుకుంటూ, అపోలో హాస్పిటల్స్ గ్రూప్ భారతదేశంలో 1.5 మిలియన్ల వ్యాక్సిన్లు మరియు తెలంగాణలో 2,00,000 టీకాలతో అపోలో హాస్పిటల్స్, హైదరాబాద్ ఇప్పటివరకు అతి పెద్ద వ్యాక్సిన్ డ్రైవ్ గా నిలిచాయి.

అపోలో హాస్పిటల్స్, హైదరాబాద్ తెలంగాణలోని తన ఆసుపత్రులలో వ్యాక్సిన్ లు వేయడమే కాకుండా, రంగా రెడ్డి జిల్లా, కరీంనగర్ మరియు భద్రాచలంలలో అనేక మేగా క్యాంపులను నిర్వహించింది. ప్రోగ్రాములో భాగంగా హాస్పిటల్ మాధాపూర్ లోని HICC లో రోజుకు 25,000 టీకాలు అందించే సామర్ధ్యంతో అతి పెద్ద వ్యాక్సినేషన్ కేంద్రంను ప్రారంభించింది.ఒక ప్రైవేట్ రంగం ద్వారా నిర్వహించబడుతున్న దేశంలో ఒక పెద్ద వ్యాక్సిన్ కేంద్రం మరియు గత 10 రోజుల నుండి సేవలను అందిస్తున్నది.

ఫ్రంట్‌లైన్ వర్కర్లు, అత్యవసర పరిశ్రమలో పనిచేసే ఉద్యొగులు, ఇండ్లలో పని చేసే వారు మరియు సహాయకులతో సహా హౌసింగ్ కాలనీలు,ఐటి ప్రోఫేషనల్స్ మరియు తెలంగాణలోని ఇతర పౌరులు ఈ కార్యక్రమంలో లబ్ధి పొందుతున్నారు.

తెలంగాణలో గరిష్ట సంఖ్యలో ప్రజలను చేరుకోవడం మరియు మెగా వ్యాక్సిన్ డ్రైవ్‌లో ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడమే అపోలో హాస్పిటల్స్ యొక్క ప్రయత్నం. ప్రస్తుతం కోవిషీల్డ్ మరియు కోవాక్సిన్ వ్యాక్సిన్లు అందించడం జరుగుతున్నది మరియు రాబోయే రెండు వారాల్లో స్పుత్నిక్ వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి రానున్నది.ఈ ఘోరమైన మహమ్మారిని గెలవడానికి ఇది ఏకైక ఖచ్చితమైన సాధనం.పౌరులు ముందుకు వచ్చి ప్రభుత్వ లేదా ప్రైవేట్ వ్యాక్సిన్ కేంద్రాలలో ఏవైనా అందుబాటులో ఉన్న వ్యాక్సిన్ లు వేయించుకోవాలని అపోలో హాస్పిటల్స్ అభ్యర్ధిస్తున్నది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com