టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న ధనుష్!
- June 07, 2021
చెన్నై: కోలీవుడ్ స్టార్ హీరోలు సూర్య, కార్తీ ఇప్పటికే స్ట్రయిట్ తెలుగు సినిమాలలో నటించేశారు. విజయ్ ఆంటోని సైతం తెలుగులో తన చిత్రాలకు లభిస్తున్న ఆదరణను దృష్టిలో పెట్టుకుని స్ట్రయిట్ తెలుగు సినిమాలో తప్పకుండా నటిస్తానని చెబుతున్నాడు. ఇక ఇటీవల విజయ్ తో తెలుగు సినిమా తీయబోతున్నట్టు ప్రముఖ నిర్మాత దిల్ రాజు ప్రకటించాడు. ఈ నేపథ్యంలోనే తమిళ స్టార్ హీరో ధనుష్ కూడా తెలుగు సినిమాలో నటించడానికి పచ్చజెండా ఊపినట్టు తెలుస్తోంది. నిజానికి చాలా కాలం తమిళచిత్రసీమకే పరిమితం అయిన ధనుష్ ఆ మధ్య హిందీ సినీ రంగ ప్రవేశం చేశాడు. ఆ తర్వాత ఆంగ్ల చిత్రంలో నటించాడు. ఇప్పుడు ఓ అమెరికన్ మూవీలోనూ నటిస్తున్నాడు. ఆ రకంగా చూసినప్పుడు ధనుష్ దక్షిణాది భాషల్లో తమిళం తర్వాత నటిస్తున్నది తెలుగులోనే అని చెప్పాలి. ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ, ఓ పాపులర్ దర్శకుడితో ఈ సినిమాను నిర్మించబోతోందట. రెండు మూడు భాషల్లో నిర్మితం కాబోతున్న ఈ మూవీలో ఓ సీనియర్ హీరో కూడా నటించబోతున్నాడట. తెలుగులోనూ ఇటీవల ధనుష్ నటించిన సినిమాలకు ఆదరణ లభిస్తుండటం, వరల్డ్ వైడ్ అతనికి విశేషంగా అభిమానులు ఉండటంతో సహజంగానే ఈ ప్రాజెక్ట్ కు క్రేజ్ వచ్చే ఆస్కారం ఉంది. చిత్రం ఏమంటే… ఈ మూవీ కథ గురించి, సాంకేతిక నిపుణుల గురించి తెలిసిన ఓ తెలుగు స్టార్ హీరో తానే నటిస్తానంటూ దర్శకనిర్మాతలకు హింట్ ఇస్తున్నాడట. మరి ఏం జరుగుతుందో చూడాలి.
తాజా వార్తలు
- అమరనాథ్ యాత్ర తేదీలు ఖరారు..
- తిరుమల శ్రీవారి జులై నెల సేవా టికెట్ల విడుదల
- ఈస్ట్-వెస్ట్ పైప్లైన్ ఫుల్ పంపింగ్ సామర్థ్యం పునరుద్ధరణ..!!
- ఉమ్ సలాల్ సెంట్రల్ మార్కెట్ లో మున్సిపల్ మినిస్టర్ తనిఖీలు..!!
- దుబాయ్-చైనా ఆర్థిక సంబంధాల విస్తరణపై చర్చలు..!!
- 24-గంటలపాటు ఫుడ్ హబ్ ప్రారంభం..!!
- 15 ఏళ్ల ప్రవాస బాలిక ఆచూకీ లభ్యం..!!
- భారీ వర్షాల నేపథ్యంలో సౌదీలో క్లాసులు రద్దు..!!
- గోల్డెన్ వీసా హోల్డర్లు విదేశాల నుంచి పని చేయవచ్చా?
- సౌదీ అరేబియాలో తెలుగు సమాఖ్య సేవా గాథ—నిరాశలో ఉన్న వ్యక్తికి కొత్త జీవితం









