కువైట్ వెలుపల వ్యాక్సినేషన్ పొందినవారి రిజిస్ట్రేషన్‌కి అనుమతి

- June 07, 2021 , by Maagulf
కువైట్ వెలుపల వ్యాక్సినేషన్ పొందినవారి రిజిస్ట్రేషన్‌కి అనుమతి

కువైట్: కువైట్ ఆమోదించిన వ్యాక్సినేషన్లను కువైట్ వెలుపల పొందినవారికి రిజిస్ట్రేషన్ కోసం కువైట్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అనుమతిస్తోంది. పబ్లిక్ హెల్త్ డిపార్టుమెంట్ నుంచి వీరికి అనుమతి కోసం ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ తప్పనిసరి. ‘ఇమ్యూన్ యాప్’లో రిజిస్టర్ చేసుకుంటే, కువైట్‌లో వ్యాక్సిన్ పొందితే లభించే సౌకర్యాలే ఇతర దేశాల్లో వ్యాక్సిన్ పొందినవారికీ లభిస్తాయి. https://vaxcert.moh.gov.kw/SPCMS/PH/CVD_19_Vaccine_External_Registraation.Aspx వెబ్‌సైట్‌లో తమ వ్యాక్సిన్ డాక్యుమెంట్ అప్‌లోడ్ చెయ్యాల్సి వుంటుంది. పబ్లిక్ హెల్త్ డిపార్టుమెంట్ ఆ డాక్యుమెంట్‌ని పరిశీలిస్తుంది. ఆ వివరాలు సరిగ్గా వుంటే, దాన్ని ఆమోదించడం జరుగుతుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com