భారత్ - యూఏఈ ప్రయాణం పై అప్డేట్...ట్రావెల్ బ్యాన్ పొడిగింపు...
- June 08, 2021
యూఏఈ: భారత్ నుంచి వచ్చే విమానాలపై ట్రావెల్ బ్యాన్ ను తదుపరి ఆదేశాల వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది యూఏఈ. నేడు యూఏఈ జనరల్ అథారిటీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ సస్పెన్షన్‌ను పొడిగించినట్లు తెలిపింది. ఈ క్రమంలో, భారత్ నుండి యూఏఈ కు జులై 6 వరకు విమానాలను నిషేదించటం జరిగింది అంటూ ఎయిర్ ఇండియా ప్రకటించింది.
అయితే..యూఏఈ పౌరులు, గోల్డెన్ వీసాదారులు, దౌత్యపరమైన పనుల మీద ప్రయాణం చేసేవారు, సవరించిన కోవిడ్ ప్రోటోకాల్ మేరకు ప్రయాణానికి అనుమతించిన వర్గాల వారికి మాత్రం ఆంక్షల నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు యూఏఈ వెల్లడించింది. కోవిడ్ వ్యాప్తి నియంత్రణ కోసం భారత్ నుంచి యూఏఈకి ప్రయాణాలపై ఆంక్షలు విధించాల్సి వచ్చిందని, తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఆంక్షలు కొనసాగుతాయని జాతీయ అత్యవసర, విపత్తుల నిర్వహణ అథారిటీ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ
- బహ్రెయిన్‌లో న్యాయ సేవలకు ఈ-పేమెంట్ సర్వీస్..!!
- ఒమన్‌లో విద్యుత్ కేబుళ్ల చోరీ.. నలుగురి అరెస్టు..!!
- కువైట్‌లో కార్మికుల హక్కులకు మరింత రక్షణ..!!
- 2029 నాటికి అందుబాటులోకి అబుదాబి ‘స్ఫియర్’..!!
- హైదరాబాద్‌లో విదేశీ వర్సిటీలు
- కువైట్‌లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!







