‘నాన్న ఎప్పుడూ విలువలతో కూడిన చిత్రాలే తీశారు’ - డి.సురేష్‌బాబు

- June 08, 2021 , by Maagulf
‘నాన్న ఎప్పుడూ విలువలతో కూడిన చిత్రాలే తీశారు’ - డి.సురేష్‌బాబు

వంశీ గ్లోబల్‌ అవార్డ్స్‌, ఇండియా, సంతోషం ఫిలిమ్‌ న్యూస్‌, తెలుగు కళాసమితి, ఒమన్, పద్మభూషణ్‌ పురస్కార గ్రహీత, గిన్నీస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌సినీ నిర్మాత, దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డుగ్రహీత,మూవీ మొఘల్‌, పార్లమెంటు పూర్వసభ్యులు స్వర్గీయ డా॥ డి. రామానాయుడు 86వ జయంతి సందర్భంగా అంతర్జాల వేదికగా మస్కట్‌లో జరిగిన కార్యక్రమంలో పలువురు సినీప్రముఖులు,5 ఖండాలలోని ప్రముఖులు ఆయనకు ఘననివాళి అర్పించారు. నిర్మాత అనే పదానికి అసలు సిసలైన చిరునామా డా॥ డి.రామానాయుడు అని వక్తలు కొనియాడారు. ఆయన కుమారుడు, సినీ నిర్మాత డి. సురేష్‌బాబు మాట్లాడుతూ, ‘నాన్న చాలా సినిమాలు తీశారు. ఆయన ఎప్పుడూ విలువలతో కూడిన చిత్రాలే నిర్మించారు. పరిశ్రమకు ఏదైనా అవసరమైతే నాన్న ఎలాగైతే స్పందించారో అదే స్ఫూర్తితో పనిచేయడానికి నేను సిద్ధంగా ఉంటాన’ని అన్నారు. నటుడు, నిర్మాత, మాజీ పార్లమెంటు సభ్యులు మురళీమోహన్‌ మాట్లాడుతూ, ‘సినిమా అనేది అద్భుతమైన మాధ్యమం. సినిమా నిర్మాత అవ్వాలంటే అన్ని విభాగాల మీద పూర్తి అవగాహన  ఉండాలని చెప్పిన వ్యక్తి రామానాయుడుగారు’ అని కొనియాడారు. శిరోమణి డా॥ వంశీ రామరాజు మాట్లాడుతూ ‘ప్రేమించు’ చిత్రం జయప్రదమైన సందర్భంలో దివ్యాంగుల ఆశ్రమాలకు చేయూతనిచ్చిన మానవతామూర్తి రామానాయుడు’ అన్నారు. తెలుగు కళాసమితి ఒమన్ కన్వీనర్‌ అనిల్‌కుమార్‌ మాట్లాడుతూ, ‘ఓడిపోతామనే ఆలోచనలో ఉన్నవారు రామానాయుడు జీవితాన్ని తరచి చూస్తే ఆయన ఆదర్శంగా అదే బాటలో పయనిస్తార’ని అన్నారు.

ఈ కార్యక్రమాన్ని ప్రముఖ అంతర్జాతీయ గాయని శివశంకరి గీతాంజలి నిర్వహించారు. సురేష్‌ కొండేటి, మండలి బుద్ధప్రసాద్‌, దర్శకుడు బి. గోపాల్‌, మాధవపెద్ది సురేష్‌, బలభద్రపాత్రుని రమణి, భువనచంద్ర, చంద్రబోస్‌, కాశీ విశ్వనాథ్‌, వి.ఎన్‌. ఆదిత్య, రామకృష్ణ గౌడ్‌, రవి కొండబోలు, ముప్పలనేని శివ, ఉపేంద్ర చివుకుల, డా॥ ఎల్లాప్రగడ రామకృష్ణారావు, రత్నకుమార్‌ కవుటూరు, చింతగుంట ఉదయపద్మ, డా॥ బూరుగుపల్లి వ్యాసకృష్ణ, లలితా రామ్‌, హరివేణుగోపాల్‌, రాజేష్‌ తోలేటి, సరోజా కొమరవోలు, శ్రీదేవి జాగర్లమూడి, సుబ్బు వి. పాలపర్తి, చింతలపూడి త్రినాథరావు, లయన్‌ ఎ. విజయకుమార్‌, చైతన్య సూరపనేని, దైవజ్ఞ శర్మ, శ్రీవాణి, రేలంగి నరసింహారావు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు.ఈ  వర్చ్యువల్ ఈవెంట్ కి మాగల్ఫ్.కామ్ మీడియా పార్టనర్ గా వ్యవహరించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com