ఖతార్లో 50%పైగా యువతకు కోవిడ్ వ్యాక్సినేషన్ పూర్తి
- June 09, 2021
దోహా: కోవిడ్ ను సమర్ధవంతంగా నియంత్రించేందుకు వ్యాక్సినేషన్ ప్రోగ్రాంను ముమ్మరం చేసింది ఖతార్. వ్యాక్సినేషన్ ప్రారంభించనప్పటి నుంచి ఇప్పటివరకు 50 శాతం వయోజన జనాభాకు కోవిడ్ వ్యాక్సినేషన్ను పూర్తి చేసింది. ఈ మేరకు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వ్యాక్సిన్ గణాంకాల వివరాలను వెల్లడించింది. 16 ఏళ్లు, అంతకుమించిన వయస్సున్న జనాభాలో 50.7 శాతం మంది రెండు డోసులు తీసుకున్నట్లు తెలిపింది. ఫైజర్, మోడరనా వ్యాక్సిన్ రెండో డోసు తీసుకున్న రెండు వారాల తర్వాతే టీకాలు వేసినట్లు లెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇదిలాఉంటే..జాతీయ వ్యాక్సినేషన్ ప్రోగ్రాం ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటివరకు ఓవరాల్ గా 2,716,670 కోవిడ్ 19 వ్యాక్సిన్ ఇచ్చినట్లు వెల్లడించింది. అలాగే గత 24 గంటల్లో 15,728 కోవిడ్ -19 వ్యాక్సిన్ డోసులను అందించారు. అర్హులైన జనాభాలో 67.3 శాతం మందికి ఇప్పుడు కనీసం ఫస్ట్ డోస్ పొందారని..60 ఏళ్లకు మించిన వారిలో 93.9 శాతం మంది సింగిల్ డోస్ పూర్తి అయిందని ఆరోగ్య శాఖ వివరించింది.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ
- బహ్రెయిన్‌లో న్యాయ సేవలకు ఈ-పేమెంట్ సర్వీస్..!!
- ఒమన్‌లో విద్యుత్ కేబుళ్ల చోరీ.. నలుగురి అరెస్టు..!!
- కువైట్‌లో కార్మికుల హక్కులకు మరింత రక్షణ..!!
- 2029 నాటికి అందుబాటులోకి అబుదాబి ‘స్ఫియర్’..!!
- హైదరాబాద్‌లో విదేశీ వర్సిటీలు
- కువైట్‌లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!







