మస్కట్ లో తెరచుకోనున్న దేవాలయాలు, చర్చిలు
- June 12, 2021
మస్కట్: ఒమన్‌లో కరోనా వల్ల రెండు నెలలుగా తాత్కాలికంగా మూతపడ్డ దేవాలయాలు, చర్చిలు తిరిగి తెరచుకోనున్నాయి.దేశవ్యాప్తంగా కోవిడ్ ఆంక్షలను సడలిస్తున్న నేపథ్యంలో సుల్తానేట్ తిరిగి ఆలయాలు,చర్చిలను తెరవాలని నిర్ణయించింది. దీనిలో భాగంగా దర్సైత్‌లోని శ్రీ క్రిష్ణ ఆలయం,మస్కట్‌లోని శ్రీ శివాలయం నేటి నుంచి తెరచుకుంటే..చర్చిలు రేపటితో తెరచుకోనున్నాయి.అయితే,ఆలయాలు,చర్చిలకు వచ్చే వారు తప్పనిసరిగా ముఖానికి మాస్కు ధరించడం,సామాజిక దూరం పాటించాలని సంబంధిత అధికారులు తెలిపారు.అలాగే రెండు ఆలయాల్లో పరిమిత సంఖ్యలో మాత్రమే భక్తులకు అనుమతి ఉంటుందని పేర్కొన్నారు.ఈ మేరకు ఆయా దేవాలయాల,చర్చిల మేనేజ్‌మెంట్స్ జారీచేసే గైడ్‌లైన్స్‌ను భక్తులు తప్పకుండా ఫాలోకావాలని ఆదేశించారు.

తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్‌చుక్ సంచలన పోస్ట్!







