ఎంఎల్ఏ పదవికి రాజీనామా చేసిన ఈటల రాజేందర్
- June 12, 2021
హైదరాబాద్: తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ తన ఎంఎల్ఏ పదవికి రాజీనామా చేశారు. శామీర్ పేటలోని తన ఇంటి నుంచి అనుచరులతో బయలు దేరిన ఆయన గన్‌పార్కుకు చేరుకుని అమరవీరుల స్థూపాలకు నివాళులు అర్పించారు. అనంతరం అసెంబ్లీకి వెళ్లి అక్కడ స్పీకర్ కార్యాలయంలో ఎంఎల్ఏ పదవికి రాజీనామా చేశారు. రాజీనామా అనంతరం ఈటల మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించారు. 17 ఏళ్లు ఎమ్మెల్యేగా కొనసాగాను. ఇప్పుడు రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నాను. తనను రాజీనామా చేయమని ప్రజలే ఆశీర్వదించారన్నారు. కరోనా కట్టడికి తెలంగాణ సర్కారు సరైన చర్యలు తీసుకోలేదని అన్నారు. తాను ప్రజల మద్దతునే ఇన్నాళ్లు గెలుస్తూ వచ్చానని అన్నారు. కాగా, ఈటల ఈనెల 14న భాజాపాలో చేరడం ఖాయమైంది. ఇప్పటికే ఢిల్లీకి వెళ్లి ఆ పార్టీకి సంబంధించిన అగ్రనేతలను కలిసి వచ్చారు. ఇక ాయనతో పాటు కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురైన ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్, ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, తుల ఉమ, గండ్ర నళిని, బాబయ్య తదితరులు కూడా భాజపాలో చేరడానికి సన్నద్ధమవుతున్నారు.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్‌చుక్ సంచలన పోస్ట్!







