'ఐఏఎస్' కావాలనుకుంటున్నవారికీ సోనూ సూద్ సాయం..
- June 12, 2021
ముంబై: సోనూసూద్ తన సేవలను విస్తరిస్తున్నారు. తాజాగా సివిల్ సర్వీసెస్‌లో చేరాలనుకునే వారికి అండగా నిలవాలనుకుంటున్నారు. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ (ఐఎఎస్) పరీక్షకు సన్నద్ధులయ్యే వారికి ఉచితంగా కోచింగ్ తీసుకునేందుకు స్కాలర్‌షిప్ ప్రకటించారు. మీరు ఐఎఎస్ కోసం సిద్ధం కావాలనుకుంటే, మేము మీ బాధ్యత తీసుకుంటాము" అని సోనూ ట్వీట్ చేశారు. ఇందుకోసం సంభవం ను ప్రారంభిస్తున్నాం. అభ్యర్థులు జూన్ 30 లోగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. వెబ్‌సైట్ వివరాలను ఆ ట్వీట్‌లో పొందుపరిచారు. సోనూసూద్ ఫౌండేషన్ ద్వారా ఆయన తన సేవా కార్యక్రమాలను విస్తరిస్తున్నారు. మహమ్మారి కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు ఉచిత విద్యను సోనూ అందిస్తున్నారు. ఇందుకోసం ఈ నెల ప్రారంభంలో, అతడు పంజాబ్ లోని సిటీ విశ్వవిద్యాలయంతో కలిసి తన సహకారాన్ని ప్రకటించారు. ఇ-రిక్షాలు, ఉపాధి కోల్పోయిన వారికి సహాయం అందించడం, వైద్య చికిత్స అందించడంతో పాటు సోనూ అనేక వేదికలను ప్రారంభించారు.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్‌చుక్ సంచలన పోస్ట్!







