10 మంది కోవిడ్ పేషెంట్లలో 8 మంది వ్యాక్సిన్ పొందనివారే!

- June 13, 2021 , by Maagulf
10 మంది కోవిడ్ పేషెంట్లలో 8 మంది వ్యాక్సిన్ పొందనివారే!

దుబాయ్: కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నవారి కంటే తీసుకోని వారిపైనే వైరస్ ప్రభావం ఎక్కువగా ఉందని దుబాయ్ ఎమిరాతి ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం నమోదవుతున్న కోవిడ్ కేసుల్లో ప్రతి 10 మందిలో 8 మంది వ్యాక్సిన్ తీసుకోని వాళ్లేనని వెల్లడించింది. దుబాయ్ హెల్త్ అథారిటీ విడుదల చేసిన గణాంకాల మేరకు ప్రస్తుతం కోవిడ్ తో ఆస్పత్రుల్లో చేరుతున్న వారు, ఐసీయూలో చికిత్స పొందుతున్న వారిలో ప్రతి పది మందిలో తొమ్మిది మంది వ్యాక్సిన్ తీసుకోలేదని స్పష్టం అవుతోంది. ఎమిరాతి పరిధిలోని ప్రతి ఒక్కరు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలని, తద్వారా వైరస్ తీవ్రత తగ్గుతుందన్న విషయం గుర్తుంచుకోవాలని దుబాయ్ హెల్త్ అథారిటీ పిలుపునిచ్చింది. వ్యాక్సిన్ తీసుకుంటే ఒక వేళ వైరస్ బారిన పడినా ఆస్పత్రిలో చేరకుండానే కోలుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com