బంగారు నగలపై ఫోర్జరీ ముద్ర..ఆసియా వ్యక్తి అరెస్ట్
- June 13, 2021
కువైట్: బంగారు ఆభరణాలపై వాణిజ్య మంత్రిత్వ శాఖ ఫోర్జరీ ముద్రను వేసినందుకు ఆసియా జాతీయుడిని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ అరెస్టు చేసింది.బంగారు నగల విక్రయాలకు ముందుగా ఆయా నగల స్వచ్ఛత, బరువును తనిఖీ చేసి అన్ని సరిగ్గా ఉంటేనే వాణిజ్య మంత్రిత్వ శాఖ ముద్ర వేస్తుంది.ఆ తర్వాతే బంగారు నగలు అమ్మకానికి వీలుంటుంది. అయితే..ఆసియాకు చెందిన వ్యక్తి మాత్రం మంత్రిత్వ శాఖ తనిఖీలు లేకుండానే నకిలీ మినిస్ట్రి స్టాంప్ తో మోసాలకు పాల్పడుతున్నట్లు అధికారులు తమ తనిఖీల్లో గుర్తించారు.క్రిమినల్ సెక్యూరిటీ విభాగం, వాణిజ్య మంత్రిత్వ శాఖ సంయుక్త ఆపరేషన్‌లో ఫోర్జరీ గుట్టు బయటపడింది. దీంతో అతన్ని అధికారులు అరెస్టు చేశారు. స్టాంప్‌ను ఫోర్జరీ చేసేందుకు వినియోగించిన లేజర్ పరికరం, ల్యాప్‌టాప్ కంప్యూటర్ స్వాధీనం చేసుకున్నారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- ఖతర్‌లో సేవలకు తెలంగాణ గల్ఫ్ సమితి అధ్యక్షుడు మైదం మధుకు ఎంబసీ సత్కారం
- IPL 2026: కోల్‌కతా నైట్ రైడర్స్ కు మరో ఓటమి..
- ఘనంగా జరిగిన ఇండియన్ నేషనల్ సినీ అకాడమీ (INCA) అవార్డ్స్ వేడుక
- హార్ముజ్ జలసంధిని తెరిచిన ఇరాన్
- సీఎం చంద్రబాబు నాయుడుతో డా. శ్రీధర్ బెవర భేటీ
- ఫుజైరా రూలర్ తో యూఏఈ అధ్యక్షుడు భేటీ.. ఫుజైరా పోర్ట్ పరిశీలన
- ఎన్డీఏకి ఎదురుదెబ్బ..వీగిపోయిన మహిళా రిజర్వేషన్ బిల్లు!
- బంగారం దిగుమతుల పై కేంద్రం కీలక నిర్ణయం
- అమెజాన్ ‘AI స్టోర్’ ప్రారంభం
- ఎన్నికల సంఘం కమిషనర్‌గా అనిల్ చంద్ర పునేఠా నియామకం









