కనీసం తొలి డోస్ తీసుకున్న వారికే హజ్ యాత్రకు అనుమతి
- June 13, 2021
సౌదీ: కోవిడ్ నేపథ్యంలో ఈ ఏడాది హజ్ యాత్రికుల సంఖ్యను పరిమిత సంఖ్యలోనే అనుమతిస్తున్నట్లు సౌదీ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది.హజ్ యాత్రకు తమ పేర్లను నమోదు చేసుకున్నవారు తప్పనిసరిగా వ్యాక్సిన్ పొంది ఉండాలని కూడా క్లారిటీ ఇచ్చింది. కనీసం ఒక్క డోస్ వ్యాక్సిన్ పొందిన వారికే హజ్ ప్రార్ధనలకు అనుమతి ఉంటుందని ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ తవ్ఫిక్ అల్-రబియా తాజాగా ప్రకటించారు.రిజిస్ట్రేషన్లలో నికిలీలకు తావులేకుండా, వ్యాక్సిన్ తీసుకున్నవారికే ఖచ్చితమైన రిజిస్ట్రేషన్లు నిర్వహించేలా ఈ-సిస్టం వ్యవస్థ పని చేస్తుందని మంత్రి వివరించారు. అలాగే మక్కాలోని మూడు ఆస్పత్రుల్లో కావాల్సిన వైద్య పరికరాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. భక్తులను కోవిడ్ ముప్పు నుంచి తప్పించేందుకే హజ్ యాత్రికుల సంఖ్యను పరిమితం చేసినట్లు వివరించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







