గ్యాస్ కు వీటితో చెక్ పెట్టండి

- June 13, 2021 , by Maagulf
గ్యాస్ కు వీటితో చెక్ పెట్టండి

బరువు తగ్గాలని బ్రేక్ ఫాస్ట్ మానేస్తుంటే పొట్టలో గ్యాస్ ఫామ్ అవుతోంది.ఏం చెయ్యాలని తల పట్టుకుంటారు. ఇంటి నివారణలు ఎల్లప్పుడూ మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.బరువు తగ్గేందుకు ముఖ్యంగా చేయవలసినవి సరైన ఆహారం, వ్యాయామం.క్రమం తప్పకుండా చేస్తుంటే బరువు తగ్గుతారు. జీర్ణక్రియ సక్రమంగా పని చేస్తుంది.మలబద్దకాన్ని నివారిస్తుంది. మిరియాలు, నిమ్మరసం అద్భుతంగా పని చేస్తాయి.శరీరంలో పేరుకొన్న విషవాయువులను బయటకు పంపిస్తుంది ఈ మిశ్రమం.నిమ్మకాయ, మిరియాలు జీర్ణక్రియను మెరుగుపరచడానికి గొప్ప సహాయకారిగా పని చేస్తుంది. ఇది అన్ని జీర్ణసమస్యలను తొలగించడానికి మరియు ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. రోగనిరోధకశక్తి పెంపొందేందుకు తోడ్పడుతుంది. ఊబకాయం, గ్యాస్ శరీరం యొక్క రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తాయి.

నిమ్మలో ఉండే సి విటమిన్ జలుబు, అలెర్జీ వంటి అనేక వ్యాధుల నుంచి శరీరాన్ని కాపాడుతుంది. శరీరంలో రక్త ప్రవాహాన్ని పెంచడానికి మిరియాలు, నిమ్మరసం సహాయపడుతుంది. ఇది గుండె ఆరోగ్యానికి కూడా మంచిదే. రక్తనాళాలలో ఉన్న ప్రతిష్టంభనను తొలగిస్తుంది. శరీరంపై గాయాలను త్వరగా నయం చేయడానికి తోడ్పడుతుంది. శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తుంది. ప్రతి రోజు ఉదయాన్నే గ్లాసు గోరు వెచ్చని నీటిలో ఒక చెక్క నిమ్మరసం పిండి, దానికి చిటికెడు ఉప్పు, పావు స్పూన్ మిరియాల పొడి జోడించి తాగాలి. ఇది ఊబకాయాన్ని తగ్గించడంలో అద్భుతమైన ఐషధంగా పని చేస్తుంది. నిమ్మకాయలో 0.8 కేలరీలు ఉంటాయి. కొవ్వు వుండదు. ఇందులో 689 మి.గ్రా సోడియం, 0.4 గ్రా ఫైబర్, 1 గ్రా కార్బొహైడ్రేట్లు, 0.2 ప్రొటీన్లు ఉంటాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
Copyrights 2015 | MaaGulf.com