ఒమాన్ రాజధానిలో నీటికి కటకట
- June 03, 2015
వేసవి కారణంగా ఒమాన్ రాజధాని మస్కట్లో నీటి సమస్యలు తీవ్రతరం కాబోతున్నాయి. మే మొదటి వారం నుంచే తీవ్రమైన నీటి సమస్య రానున్న మూడు నెలల్లో ఇంకా తీవ్రంగా ఉండబోతోందని అంచనా వేస్తున్నారు. పవిత్ర రమదాన్ మాసంలో కూడా మస్కట్ వాసులకు నీటి కష్టాలు తప్పకపోవచ్చు. ఉదయాన్నే లేచి, నీటి కోసం పరుగులు తీస్తున్న మస్కట్ వాసులు, ట్యాంకర్ల వద్ద పడిగాపులు కాయాల్సి వస్తోంది. దీంతో నీటికి డిమాండ్ పెరిగి, ఒక్కసారిగా నీళ్ళ ధరలూ అమాంతంగా పెరిగిపోయాయి. ఆన్లైన్లో నీటి బుకింగ్లకు తోడు, ఆఫ్ లైన్లో నీటి ట్యాంకర్లు క్షణం తీరిక లేకుండా పనిచేస్తున్నాయి. నీటి సమస్యలతో ఇంటికి బంధువుల్ని పిలవడానికీ మస్కట్ వాసులు ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుత సమస్యతోనే సతమతమవుతున్న మస్కట్ వాసులు, మూడు నెలలపాటు సమస్యను ఎదుర్కోవాల్సి ఉండటంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
--నూనె లెనిన్ కుమార్(ఒమాన్)
తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







