రాత్రి 8 గంటల వరకు రెస్టారెంట్లకు అనుమతి
- June 15, 2021
కువైట్: కరోనా మహమ్మారి ముప్పు ఇంకా పూర్తి తొలిగిపోనందున కమర్షియల్ కాంప్లెక్స్, రెస్టారెంట్లపై ఆంక్షలు కొనసాగించాలని కువైట్ మంత్రి మండలి నిర్ణయించింది. అయతే..వైరస్ తీవ్రత మునుపటి స్థాయిలో లేకపోవటంతో కొద్దిమేర సడలింపులు ఇచ్చింది. రెస్టారెంట్ల క్లోజింగ్ సమయాన్ని పొడిగించింది.రాత్రి 8 గంటల వరకు రెస్టారెంట్లను నిర్వహించుకోవచ్చని మంత్రి మండలి స్పష్టం చేసింది.అయితే..ఓపెనింగ్ సమయాల్లో మాత్రం ఎలాంటి మార్పులు ఉండవు. ఇదిలాఉంటే..కోవిడ్ నేపథ్యంలో పిల్లల ఆట వస్తువుల అమ్మకాలు, హుక్కా కేంద్రాలను మరికొంత కాలం మూసివేయాలని నిర్ణయించింది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ
- బహ్రెయిన్‌లో న్యాయ సేవలకు ఈ-పేమెంట్ సర్వీస్..!!
- ఒమన్‌లో విద్యుత్ కేబుళ్ల చోరీ.. నలుగురి అరెస్టు..!!
- కువైట్‌లో కార్మికుల హక్కులకు మరింత రక్షణ..!!
- 2029 నాటికి అందుబాటులోకి అబుదాబి ‘స్ఫియర్’..!!
- హైదరాబాద్‌లో విదేశీ వర్సిటీలు
- కువైట్‌లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!







