వ్యాక్సిన్ ఇప్పిస్తామని డబ్బులు తీసుకున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్
- June 15, 2021
బహ్రెయిన్: కోవిడ్ వ్యాక్సిన్ ఇప్పిస్తామంటూ డబ్బులు తీసుకుంటున్న ఓ పురుషుడు, మరో మహిళను బహ్రెయిన్ పోలీసులు అరెస్ట్ చేశారు.అరెస్టైన ఈ ఇద్దరు ప్రవాసీయులను టార్గెట్ గా చేసుకొని కోవిడ్ వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. కోవిడ్ ను ఎదుర్కొనేందుకు బహ్రెయిన్ ప్రభుత్వం అర్హులైన అందరికీ ఉచితంగానే వ్యాక్సిన్ అందిస్తున్న విషయం తెలిసిందే. దిగుమతి అవుతున్న వ్యాక్సిన్ బ్యాచుల ఆధారంగా ఓ ప్రణాళికతో ప్రాధాన్య వర్గాలుగా వ్యాక్సిన్ అందిస్తోంది. అయితే..వ్యాక్సిన్ తీసుకోవాలనే ఉద్దేశంతో అమాయకులైన వారు, కొందరు ప్రవాసీయులు రిజిస్ట్రేషన్లకు ఇతరుల మీద ఆధారపడుతున్నారు. ఇదే అదనుగా చేసుకున్న నిందితులు బాధితుల దగ్గర డబ్బులు తీసుకొని వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ చేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్‌ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్‌లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్‌కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ







