ఒరాకిల్ ఇండియా అధినేత ప్రదీప్ అగర్వాల్ పై కేసు నమోదు
- June 15, 2021
హైదరాబాద్: ఒరాకిల్ ఇండియా అధినేతకు జూబ్లీహిల్స్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ప్రకటనల పేరుతో డబ్బులు దండుకుంటున్నారంటూ ఒరాకిల్ ఇండియా అధినేత ప్రదీప్ అగర్వాల్ దంపతుల పై జూబ్లీహిల్స్ పీఎస్‌లో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. వెబ్ సైట్స్‌లో యాడ్స్ చూపించి ప్రాజెక్టుల పేరుతో ప్రదీప్ అగర్వాల్, అతని భార్య మీను అగర్వాల్ భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారు. ప్రాజెక్టుల పేరుతో అడ్వాన్స్ పేమెంట్స్ చేయాలని క్లయింట్ల పై ఒత్తిడి తీసుకు వస్తున్నారు. అంతేగాక పేమెంటు చేయని క్లయింట్ల పై తప్పుడు ఆరోపణలు చేయడం మొదలుపెట్టారు. అతని భార్య మీను అగర్వాల్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్టు బాధితులు ఆరోపించారు. ఎంఏడీఎస్(MADS) క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో నకిలీ సైట్లు ప్రారంభించి లేని ప్రాజెక్ట్ పేరుతో క్లయింట్లకు అగర్వాల్ దంపతులు ఎర వేస్తున్నారు.ఈ నేపథ్యంలో దంపతులిద్దరి పై పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితులు. ప్రదీప్ అగర్వాల్‌పై రెండు సెక్షన్ల కింద కేస్ నమోదు చేశామని జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపారు. ఈ నెల 18 లోపు తమ ఎదుట హాజరు కావాలని నోటిసులు జారీ చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్‌గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్‌కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్
- బహ్రెయిన్, కువైట్ పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ
- పోస్టాఫీస్ అదిరిపోయే స్కీమ్..
- మోదీ పర్యటనకు ఘన ముగింపు..యుద్ధ విమానాలతో ఇండోనేషియా వీడ్కోలు
- నాగ్‌పూర్ విమానాశ్రయానికి బహుళ దశల విస్తరణ ప్రణాళికను ఆవిష్కరించిన GMR ఎయిర్‌పోర్ట్స్







