తెలంగాణ కరోనా అప్డేట్
- June 15, 2021
హైదరాబాద్: తెలంగాణలో క్రమంగా తగ్గుతూ వస్తున్న కరోనా పాజిటివ్ కేసులు.. ఇవాళ స్వల్పంగా పెరిగాయి.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,20,043 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 1,556 మందికి పాజిటివ్‌గా తేలింది.మరో 14 మంది కరోనా బాధితులు మృతిచెందగా.. 24 గంటల్లో 2070 మంది కరోనా నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారు.దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,06,436కు పెరగగా.. రికవరీ కేసుల సంఖ్య 5,82,993కు చేరింది.. ఇక, ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 3,510కు పెరిగింది.దేశవ్యాప్తంగా కరోనా రికవరీ రేటు 95.60 శాతంగా ఉంటే.. రాష్ట్రంలో 96.13 శాతంగా ఉందని.. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 19,933 యాక్టివ్ కేసులు ఉన్నాయని బులెటిన్‌లో పేర్కొంది ప్రభుత్వం.
తాజా వార్తలు
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్‌కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ
- బహ్రెయిన్‌లో న్యాయ సేవలకు ఈ-పేమెంట్ సర్వీస్..!!
- ఒమన్‌లో విద్యుత్ కేబుళ్ల చోరీ.. నలుగురి అరెస్టు..!!
- కువైట్‌లో కార్మికుల హక్కులకు మరింత రక్షణ..!!
- 2029 నాటికి అందుబాటులోకి అబుదాబి ‘స్ఫియర్’..!!







