మనామాను హెల్త్ సిటీ 2021గా ప్రకటించిన WHO
- June 16, 2021
బహ్రెయిన్: బహ్రెయిన్ రాజధాని మనామాను హెల్త్ సిటీ 2021గా గుర్తిస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. మధ్య ప్రాచ్య దేశాల్లో ఈ అరుదైన గౌరవం దక్కించుకున్న తొలి రాజధాని నగరంగా మనామా కావటం విశేషం. తూర్పు మధ్యధరా దేశాల కోసం ఏర్పాటైన WHO ప్రాంతీయ కార్యాలయం వర్చువల్ వేడుక ద్వారా ఈ ప్రకటన చేసింది. ఈ ఆన్ లైన్ వేడుకలో బహ్రెయిన్ ఆరోగ్య మంత్రి ఫైకా బింట్ సాయిద్ అల్-సలేహ్, మనామా గవర్నర్ షేక్ హేషమ్ బిన్ అబ్దుల్రహ్మాన్ అల్ ఖలీఫా, WHO రీజినల్ డైరెక్టర్, తూర్పు మధ్యధరా ప్రాంతీయ డైరెక్టర్ డాక్టర్ అహ్మద్ అల్-మంధారితో పాటు పలువురు బహ్రెయిన్ అధికారులు పాల్గొన్నారు.మనమా అందిస్తున్న అధునాతన ఆరోగ్య సేవలు, చేపట్టిన కార్యక్రమాలు నగరాన్ని హెల్త్ సిటీ 2021గా గుర్తింపు పొందేందుకు దోహదపడినట్లు మంత్రి అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ
- బహ్రెయిన్‌లో న్యాయ సేవలకు ఈ-పేమెంట్ సర్వీస్..!!
- ఒమన్‌లో విద్యుత్ కేబుళ్ల చోరీ.. నలుగురి అరెస్టు..!!
- కువైట్‌లో కార్మికుల హక్కులకు మరింత రక్షణ..!!
- 2029 నాటికి అందుబాటులోకి అబుదాబి ‘స్ఫియర్’..!!
- హైదరాబాద్‌లో విదేశీ వర్సిటీలు
- కువైట్‌లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!







