హజ్ యాత్రకు తొలి 24 గంటల్లో 4,50,000 రిజిస్ట్రేషన్లు
- June 16, 2021
సౌదీ: హజ్ యాత్రకు భారీగా రిజిస్ట్రేషన్లు నమోదవుతున్నాయి. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైన తొలి 24 గంటల్లోనే 4,50,000 మంది హజ్ యాత్ర కోసం తమ పేర్లను నమోదు చేసుకున్నట్లు హజ్, ఉమ్రా మంత్రిత్వ శాఖ వెల్లడించింది. రిజిస్టర్ చేసుకున్నవారిలో 60 శాతం మంది పురుషులు ఉండగా, 40 శాతం మంది స్త్రీలు ఉన్నట్లు వెల్లడించింది. ఇదిలాఉంటే..హజ్ యాత్రకు వచ్చే భక్తుల కోసం తొలి దశ ఏర్పాట్లు పూర్తయ్యాయి.కోవిడ్ నేపథ్యంలో భక్తుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకొని తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.రిజిస్టర్ చేసుకున్నవారిలో హజ్ యాత్రకు ఎంపిక చేసే ప్రక్రియలో ఎలాంటి వివక్షకు తావు ఉండదని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.కింగ్డమ్ జాతీయులు అందరికీ సమాన అవకాశాలు ఉంటాయని వెల్లడించింది. అయితే..గత ఐదేళ్లలో ఒక్కసారి కూడా హజ్ యాత్రకు నోచుకోని వారికి తొలి ప్రాధాన్యత ఉంటుందని తెలిపింది.
తాజా వార్తలు
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ
- బహ్రెయిన్‌లో న్యాయ సేవలకు ఈ-పేమెంట్ సర్వీస్..!!
- ఒమన్‌లో విద్యుత్ కేబుళ్ల చోరీ.. నలుగురి అరెస్టు..!!
- కువైట్‌లో కార్మికుల హక్కులకు మరింత రక్షణ..!!
- 2029 నాటికి అందుబాటులోకి అబుదాబి ‘స్ఫియర్’..!!
- హైదరాబాద్‌లో విదేశీ వర్సిటీలు
- కువైట్‌లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!







