మనామాను హెల్త్ సిటీ 2021గా ప్రకటించిన WHO

- June 16, 2021 , by Maagulf
మనామాను హెల్త్ సిటీ 2021గా ప్రకటించిన WHO

బహ్రెయిన్: బహ్రెయిన్ రాజధాని మనామాను హెల్త్ సిటీ 2021గా గుర్తిస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. మధ్య ప్రాచ్య దేశాల్లో ఈ అరుదైన గౌరవం దక్కించుకున్న తొలి రాజధాని నగరంగా మనామా కావటం విశేషం. తూర్పు మధ్యధరా దేశాల కోసం ఏర్పాటైన WHO ప్రాంతీయ కార్యాలయం వర్చువల్ వేడుక ద్వారా ఈ ప్రకటన చేసింది. ఈ ఆన్ లైన్ వేడుకలో బహ్రెయిన్ ఆరోగ్య మంత్రి ఫైకా బింట్ సాయిద్ అల్-సలేహ్, మనామా గవర్నర్ షేక్ హేషమ్ బిన్ అబ్దుల్‌రహ్మాన్ అల్ ఖలీఫా, WHO రీజినల్ డైరెక్టర్, తూర్పు మధ్యధరా ప్రాంతీయ డైరెక్టర్ డాక్టర్ అహ్మద్ అల్-మంధారితో పాటు పలువురు బహ్రెయిన్ అధికారులు పాల్గొన్నారు.మనమా అందిస్తున్న అధునాతన ఆరోగ్య సేవలు, చేపట్టిన కార్యక్రమాలు నగరాన్ని హెల్త్ సిటీ 2021గా గుర్తింపు పొందేందుకు దోహదపడినట్లు మంత్రి అభిప్రాయపడ్డారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com