కింగ్డమ్ వచ్చే విదేశీయులు వ్యాక్సిన్ స్టేటస్ నమోదు చేయాలన్న సౌదీ

- June 17, 2021 , by Maagulf
కింగ్డమ్ వచ్చే విదేశీయులు వ్యాక్సిన్ స్టేటస్ నమోదు చేయాలన్న సౌదీ

 సౌదీ: కోవిడ్ తీవ్రతను తగ్గించేందుకు పలు చర్యలు చేపట్టిన సౌదీ ప్రభుత్వం..కింగ్డమ్ వచ్చే విదేశీయులకు సంబంధించి కీలక సూచనలు చేసింది. ఇక నుంచి సౌదీ వచ్చే విదేశీయులు అందరూ ప్రయాణానికి ముందే వ్యాక్సిన్ స్టేటస్ వివరాలను తెలిజేయాలని కోరింది. ఏ వ్యాక్సిన్ తీసుకున్నారు, ఎప్పుడు తీసుకున్నారు, ఎన్ని డోసులు తీసుకున్నారనే పూర్తి వివరాలను ఆన్ లైన్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలని పాస్‌పోర్ట్స్ జనరల్ డైరెక్టరేట్ సూచించింది. వ్యాక్సిన్ స్టేటస్ ను రిజిస్ట్రేషన్ చేసుకోవటం ద్వారా ఇమ్మిగ్రేషన్ ప్రాసెస్ స్పీడ్ గా జరిగేందుకు దోహదపడుతుందని,  తద్వారా ప్రయాణీకుల నిరీక్షణ సమయం తగ్గుతుందని వెల్లడించింది. జీసీసీ దేశాల పౌరులు, కొత్తగా వీసా పొందిన వారు, ప్రవాసీయులు అందరికీ ఇదే నిబంధన వర్తిస్తుందని ప్రకటించింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com