యూఏఈ: ఎమిరేట్స్ ఐడీ అందలేదా? ఏం చేయాలంటే..
- June 17, 2021
యూఏఈ: ఎమిరేట్స్ ఐడీలను రెన్యువల్ చేసుకున్న రెసిడెంట్స్ కొందరు ఇంకా వాటిని అందుకోలేకపోయారు. కొత్త వెర్షన్ ఎమిరేట్స్ ఐడీ జారీ ప్రక్రియ నేపథ్యంలో ఈ ఆలస్యం జరుగుతోంది. చాలా రకాల ప్రభుత్వ మరియు ప్రైవేటు సర్వీసుల కోసం ఎమిరేట్స్ ఐడీ తప్పనిసరి కావడంతో రెసిడెంట్స్ ఆందోళన చెందుతున్నారు ఎమిరేటీ ఐడీ ఆలస్యం కావడంతో. అయితే, ఐసీఎ యూఏఈ స్మార్ట్ యాప్ డౌన్ లోడ్ చేసుకుంటే సమస్యకు పరిష్కారం లభించినట్లేనని సంబంధిత అధికార వర్గాలు చెబుతున్నాయి. ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ అండ్ సిటిజన్ షిప్ (ఐసిఎ) ఈ విషయాన్ని వెల్లడించింది. ఎలక్ట్రానిక్ వెర్షన్ ఐడీ ద్వారా అన్ని సేవలూ పొందవచ్చునని పేర్కొంది. ఐసిఎ వెబ్ సైట్ సందర్శించి ఐసీఎ యూఏఈ స్మార్ట్ యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత యూఏఈ పాస్ లేదా వ్యక్తిగత వివరాలతో లాగిన్ అవ్వాలి. ఎమిరేట్స్ ఐడీ రెన్యువల్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. లాగిన్ అయి పర్సనల్ వ్యాలెట్ క్లిక్ చేయాలి. ఐడీని సెలక్ట్ చేసుకుని, క్యుఆర్ కోడ్ ప్రెస్ చేయాలి. తద్వారా ఎలక్ట్రానిక్ వెర్షన్ లభిస్తుంది. అన్ని సర్వీసుల కోసం ఇ-వెర్షన్ ఉపయోగపడుతుంది. గత ఏడాది నవంబర్ నెలలో ఎమిరేటీ పాస్ పోర్టులు అలాగే ఎమిరేట్స్ ఐడీలకు సంబంధించి కొత్త డిజైన్లను ప్రకటించారు.
తాజా వార్తలు
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ
- బహ్రెయిన్‌లో న్యాయ సేవలకు ఈ-పేమెంట్ సర్వీస్..!!
- ఒమన్‌లో విద్యుత్ కేబుళ్ల చోరీ.. నలుగురి అరెస్టు..!!
- కువైట్‌లో కార్మికుల హక్కులకు మరింత రక్షణ..!!
- 2029 నాటికి అందుబాటులోకి అబుదాబి ‘స్ఫియర్’..!!
- హైదరాబాద్‌లో విదేశీ వర్సిటీలు
- కువైట్‌లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!







