వాహనదారులకు శుభవార్త..
- June 18, 2021న్యూ ఢిల్లీ: వాహనదారులకు శుభవార్త.. డ్రైవింగ్ లైసెన్స్ (DL) , రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (RC), ఫిట్ నెస్ వంటి అన్ని పత్రాల వ్యాలిడిటీని 2021 సెప్టెంబర్ 30 వరకు పొడిగించింది కేంద్ర ప్రభుత్వం. కరోనా సంక్షోభ సమయంలో ఫిబ్రవరి 20 తర్వాత వ్యాలిడిటీ గడువు ముగిసిన అన్ని వాహన పత్రాలపై వ్యాలిడిటీని పొడిగించింది. ఈ మేరకు రోడ్డు, రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది.
గత ఏడాది ఫిబ్రవరి 1 నాటికి ముగిసిన అన్ని వాహన పత్రాల గడువును కేంద్ర ప్రభుత్వం గతంలో 2021 జూన్ 30 వరకు పొడిగించింది. మళ్లీ ఇప్పుడు ఆ గడువును సెప్టెంబర్ 30, 2021 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. వెహికల్ కు సంబంధించి ఫిట్‌నెస్, పర్మిట్లు, లైసెన్స్, రిజిస్ట్రేషన్, ఇతరత్రా డాక్యుమెంట్లు అన్నీ సెప్టెంబర్ 30 వరకు వ్యాలిడిటీని పెంచింది. పౌరులు, రవాణాదారులు ఇబ్బందులు ఎదుర్కొనకుండా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు సహకరించాలని కేంద్ర మంత్రిత్వ శాఖ పేర్కొంది.
అప్పటివరకూ వాహనదారులు ఈ డాక్యుమెంట్లు చెల్లుబాటు అవుతాయని, ఎలాంటి పెనాల్టీ చెల్లించాల్సిన అవసరం ఉండదు. మోటారు వాహనాల చట్టం,1988, సెంట్రల్ మోటారు వాహన నిబంధనలు,1989 ప్రకారం.. ఫిట్నెస్, పర్మిట్లు, లైసెన్సులు, రిజిస్ట్రేషన్ లేదా ఇతర పత్రాల చెల్లుబాటును మంత్రిత్వ శాఖ సెప్టెంబర్ 30 వరకు పొడిగించిందని అధికారి ఒకరు తెలిపారు. సాధారణంగా పెనాల్టీ రూ.5,000 జరిమానా ఉంది. అదే పర్మిట్ లేకుండా రూ.10,000 వేల వరకు చెల్లించాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- పాకిస్తాన్: రైల్లో బాంబు పేలుడు..20 మంది దుర్మరణం
- షార్జా ఎడారిలో మోటర్‌బైక్ బోల్తా..వ్యక్తిని రక్షించిన రెస్క్యూ టీమ్..!!
- దుబాయ్ రైడ్.. కీలక రహదారులల్లో ట్రాఫిక్ ఆంక్షలు.. !!
- యాదాద్రి పేరు మార్పు,టీటీడీ తరహాలో టెంపుల్ బోర్డు...
- వాహనదారులు అలెర్ట్.. పోలీసు కెమెరాల నిఘాలో దుబాయ్ రోడ్లు..!!
- ఐలా బ్యాంక్.. రెండు జ్యువెలరీ ప్రచారాలు ప్రారంభం..!!
- ఉత్తర రియాద్‌లో భూమి లావాదేవీలపై పరిమితులు ఎత్తివేత..!!
- నవంబర్ 10న దుబాయ్ మెట్రో సమయాలు పొడిగింపు..!!
- కొత్త తరహా దోపిడీ…అప్రమత్తం అంటున్న తెలంగాణ పోలీస్
- యూఏఈలోని ప్రవాస గృహయజమానులు మీ ఆస్తిని ఇలా సురక్షితం చేసుకోండి