నీళ్లు అధికంగా తాగడం ఆరోగ్యానికి మంచిదా? వాస్తవాలు మరియు అపోహలు
- June 18, 2021
- “అధికంగా నీరు త్రాగడం వలన ఎక్కువసార్లు మూత్రం చేయవలసి వస్తుంది కానీ చర్మం ఏమీ మెరిసిపోదు” అనే ఛలోక్తి సోషల్ మీడియాలో ఎక్కువగా చక్కర్లు కొడుతున్నది! హాస్యం కోసం అని కాకుండా, కొంతమంది ప్రముఖులు మరియు కొంతమంది హెల్త్ & వెల్‌నేస్ ప్రాక్టీషనర్లతో సహా కొందరు ఈ అంశాన్ని తప్పుగా వాదించడం మరియు ప్రచారం చేయడం అదేవిధంగా ఆరోగ్యవంతమైన వ్యక్తి చేత అధికంగా నీరు త్రాగించడం వంటివి వైద్య శాస్త్రం ఆమోదించదు.
- అధికంగా నీటిని త్రాగడం అనేది శరీరంలోని మలినాలను శుద్ది చేస్తుంది, ముఖానికి మెరుపును మరియు సాధారణ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది అనే ధోరణితో శరీరానికి వాస్తవంగా అవసరమయ్యే దానికంటే ఎక్కువగా నీరును తాగాలని వారు ప్రోత్సాహిస్తున్నట్లుగా అనిపిస్తున్నది. దీనికి ఖచ్చితమైన శాస్త్రీయ ఆధారం అంటూ ఏమీ లేదు మరియు అందుకు విరుద్దంగా అది శరీరానికి హాని కూడా కలిగించవచ్చు.
- ఆరోగ్యవంతమైన మనిషి చేయవలసినది దాహమేసినప్పుడు మాత్రమే నీరు త్రాగడం, ఆరోగ్యవంతమైన శరీరంలో అది సాధారణంగా అంతర్నితమైనటువంటి శరీర ధర్మం. కానీ, మీకు కనుక దాహం వలన, తరచుగా మూత్రం వెళ్లడం, ఎక్కువ పరిమాణంలో వెళ్లడంలో సమస్య ఉన్నదని అనుకుంటే లేదా మీకు హార్మోన్లు, గుండె, మూత్రపిండాలు, మెదడు లేదా కాలేయానికి సంబంధించిన ఆరోగ్య సమస్య ఉంటే, రోజు వారి నీరు తీసుకోవడం గురించి నిపుణుల సలహాలను తీసుకోవడం చాలా ముఖ్యం.
- వ్యాయామం చేస్తున్నప్పుడు, వాతావరణం వేడిగా ఉన్నప్పుడు లేదా నీళ్ల విరేచనాలు లేదా వాంతుల వలన శరీరం డిహైడ్రేట్‌కు గురైనప్పుడు లేదా రక్తంలో గ్లూకోజ్ స్దాయిలు అధికంగా ఉండడం వంటి ప్రత్యేక పరిస్తితులలో మాత్రమే అవసరంగా అదనపు నీరును తీసుకోవడం అనేది సాధారణ పరిస్థితులలో ఉన్నటువంటి ఆరోగ్యవంతమైన మనిషి తీసుకోవడం అనేది ఎంతమాత్రం సమర్దనీయం కాదు.
- అనవసరంగా అధికంగా నీరు తీసుకోవడం అనేది రక్తంలో సోడియం తక్కువ కావడం వలన అది వివిధ సమస్యలకు దారి తీస్తుంది. ఎక్కువ కాలం పాటు అలా అధికంగా నీరు తీసుకోవడం అనే అలవాటును ఆచరిస్తే, మూత్రపిండాలు మూత్రంను వడపోసే సామర్ద్యం కోల్పోవచ్చు. ఆందోళన, మెదడులో వాపు, మూర్చలు, మనిషి కోమాలోకి చేరడం, ఎడెమా కారణంగా శరీరం ఉబ్బినట్లు కావచ్చు మరియు గుండె సంబంధిత సమస్యలు ఏర్పడవచ్చు.
- అసంకల్పితమైన అలవాటు సైకోజెనిక్ పాలిడిప్సియా అని పిలవబడే అలవాటుగా మారి అది అధికంగా నీరు త్రాగడానికి దారి తీస్తుంది. కాబట్టి, అన్నింటికంటే ముఖ్యం ఆరోగ్యవంతమైన మనిషి అధికంగా నీరు త్రాగడం అనేది మంచి ఆరోగ్యం పేరుతో ప్రతిరోజూ అదనంగా జగ్గుల కొద్ది నీరు త్రాగడానికి ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి!
డా॥ రవి శంకర్ ఎరుకులపాటి,(సీనియర్ కన్సల్టెంట్ ఎండోక్రినాలజిస్ట్)
అపోలో హాస్పిటల్స్, హైదరాబాద్
తాజా వార్తలు
- గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ఇండెక్స్..8వ స్థానంలో ఒమన్..!!
- అమీర్ భారత్ పర్యటన విజయవంతం..!!
- సౌదీలో ముగ్గురు విదేశీయులు అరెస్ట్..!!
- శిథిల భవనాల కోసం అత్యవసర టాస్క్ఫోర్స్.. ఎంపీలు ఆమోదం..!!
- Dh1 స్కామ్: ఏఐతో వేలాది దిర్హామ్స్ కోల్పోయిన బాధితులు..!!
- అంతరాష్ట్ర ఎన్.డి.పి.ఎల్ సరఫరా చైన్ భగ్నం
- కువైట్ లో తీవ్రమైన పార్కింగ్ కొరత..అధ్యయనం..!!
- పామర్రు జనసేన పార్టీ శ్రేణులతో బండిరామకృష్ణ సమావేశం
- ప్రతి బింబాలు కథా సంపుటి ఆవిష్కరణ
- శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహోత్సవాలు ప్రారంభం