శరణార్థులకు ఆహారం, వైద్య సేవల్ని అందించిన సౌదీ అరేబియా
- June 19, 2021
ఢాకా: కింగ్ సల్మాన్ హ్యుమానిటేరియన్ ఎయిడ్ మరియు రిలీఫ్ సెంటర్ (కెఎస్ రిలీఫ్), బంగ్లాదేశ్ దేశంలోని రోహింగ్యా శరణార్థులకు ఫుడ్ బాస్కెట్లను పంపిణీ చేయడం జరిగింది. ముస్లిం వరల్డ్ లీగ్ సాయంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇటీవలే కెఎస్ రిలీఫ్, 1000 ఫుడ్ బాస్కెట్లను ఢాకా జిల్లాలోని గాజి పూర్ నగరంలో శరణార్థులకు పంపిణీ చేయడం జరిగింది. 80,000 ఫుడ్ బాస్కెట్లను 500,000 రోహింగ్యా శరణార్థులకు పంపిణీ చేయాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నారు. కాగా, కెఎస్ రిలీఫ్ క్లినిక్స్, 436 మందికి వైద్య చికిత్సలు కూడా అందించాయి జోర్డాన్ ప్రాంతంలో. ఛైల్డ్ రెస్క్యూ క్లినిక్స్ ద్వారా కూడా వైద్య సేవలు అందిస్తున్నారు. అల్ ఖౌకా ప్రాంతంలో 2,925 మందికి మొబైల్ క్లినిక్స్ ద్వారా వైద్య సేవలు అందించారు గత వారంలో. 1.47 ల్యాబ్ పరీక్షలు నిర్వహించారు. 2,449 మందికి అవసరమైన మందులు అందించారు.
తాజా వార్తలు
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్‌తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్‌లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్‌ఎయిర్ ఫ్లైట్స్..!!







