స్పీడ్ లిమిట్ పరికరాల్లో మార్పుల్లేవ్!

- June 20, 2021 , by Maagulf
స్పీడ్ లిమిట్ పరికరాల్లో మార్పుల్లేవ్!

ఒమన్: వాహనాల అతి వేగాన్ని నియంత్రించేందుకు ఏర్పాటు చేసిన స్పీట్ కంట్రోల్ పరికరాల వినియోగంలో ఎలాంటి మార్పులు ఉండవని రాయల్ ఒమన్ పోలీసులు స్పష్టం చేశారు. గతంలో తరహాలోనే వాహనాలు పరిమితికి మించి వేగంతో వెళ్తే..వాటిని స్పీట్ కంట్రోల్ వ్యవస్థ ద్వారా గుర్తిస్తామని హెచ్చరించారు. ఎవరైనా పరిమిత వేగం కంటే ఎక్కువ స్పీడుతో వెళ్తే చట్టరిత్యా చర్యలు తీసుకుంటామని రాయల్ ఒమన్ పోలీస్ లోని ట్రాఫిక్ విభాగం అధికారులు స్పష్టం చేశారు. ప్రతి వాహనదారుడు స్పీడ్ లిమిట్ కు కట్టుబడి వాహనాలను డ్రైవ్ చేయాలని కోరారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com