ఇండియా - దుబాయ్: ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ సర్వీసులు తిరిగి ప్రారంభం
- June 20, 2021
దుబాయ్: జూన్ 23 నుండి వ్యాక్సిన్ తీసుకున్న భారతీయులు దుబాయ్ కి రావచ్చు అని ప్రకటించగా ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ తమ సర్వీసులను జూన్ 23 నుండి భారత్ కు పునఃప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది.
యూఏఈ ఆమోదించిన వ్యాక్సిన్ల రెండు డోసులను పూర్తిచేసుకున్న నివాసితులు మాత్రమే దుబాయ్ వచ్చేందుకు అర్హులు. ఈ మార్పులు జూన్ 23, 2021 నుండి అమల్లోకి వస్తాయి.
ప్రయాణీకులకు గమనిక:
* ప్రయాణికులందరూ బయలుదేరే ముందు 48 గంటల్లో తీసుకున్న నెగటివ్ కోవిడ్ టెస్టు ఫలితాన్ని సమర్పించాలి.
* క్యూఆర్ కోడెడ్ పిసిఆర్ పరీక్ష ఫలిత ధృవీకరణ పత్రాలు మాత్రమే అంగీకరించబడతాయి.
* విమాన ప్రయాణానికి 4 గంటల ముందు ప్రయాణీకులందరూ రాపిడ్ పిసిఆర్ పరీక్ష చేయించుకోవాలి.
* ప్రయాణీకులందరూ దుబాయ్ విమానాశ్రయానికి చేరుకున్నప్పుడు తప్పనిసరిగా పిసిఆర్ పరీక్ష చేయించుకోవాలి.
* ప్రయాణీకులు తమ పిసిఆర్ పరీక్ష ఫలితాన్ని (ఇది 24 గంటల్లోపు అందుతుందని అంచనా) పొందే వరకు సంస్థాగత క్వారంటైన్ కు లోనవుతారు. యూఏఈ పౌరులు మరియు దౌత్యవేత్తలకు ఈ షరతుల నుండి మినహాయింపు కలదు.
మరిన్ని వివరాలకు www.emirates.ae లో చూడగలరు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







