ఇండస్ట్రీయల్ లైసెన్స్ గడువు ఐదేళ్లకు పెంపు
- June 21, 2021
సౌదీ: కోవిడ్ సంక్షోభాన్ని తట్టుకొని పారిశ్రామిక రంగం నిలదొక్కుకోవటంతో పాటు స్థిరమైన అభివృద్ధి సాధించేందుకు సౌదీ ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు తీసుకుంది. తాజాగా పారిశ్రామిక రంగానికి మరో ఆఫర్ కూడా ప్రకటించింది. ఇండస్ట్రీయల్ లైసెన్స్ గడువును మూడేళ్ల నుంచి ఐదేళ్లకు పెంచుతున్నట్లు వెల్లడించింది. పెట్టుబడుదారుల ఊరట, పారిశ్రామిక రంగంలో స్థిరత్వం కలిగించేందుకు ఈ నిర్ణయం దోహదపడనుంది. అయితే..పారిశ్రామిక విధానాలకు అనుగుణంగా అన్ని అవసరమైన నిబంధనలు పాటిస్తూ కొత్తగా లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్నవారికి, రెన్యూవల్ కోసం అప్లై చేసుకున్న వారికి ఐదేళ్ల గడువుతో ఇండస్ట్రీయల్ లైసెన్స్ జారీ చేయనున్నారు.
--జయ(మాగల్ఫ్ ప్రయతినిధి,సౌదీ అరేబియా)
తాజా వార్తలు
- పోస్టల్ పార్సిల్ .. గాజు కప్పుల్లో 40 వేల యాంఫెటమైన్ పిల్స్..!!
- అల్ ఖోర్ పోర్టులో నౌకలో అగ్నిప్రమాదం..!!
- మస్కట్‌లో ఉత్సాహంగా ‘వికసిత్ భారత్’ సాలిడారిటీ రన్..!!
- అబుదాబి-దుబాయ్ మధ్య వీకెండ్లో అదనంగా 6 రైళ్లు..!!
- అబుదాబిలో భారతీయ ప్రవాసిని వరించిన Dh25,000 బహుమతి..!!
- తైఫ్-రియాద్ హైవేపై ఘోరం.. ఐదుగురు టీచర్లు సహా ఆరుగురు మృతి..!!
- మనీ లాండరింగ్ కేసులో 8 మంది ప్రవాసులకు 10 ఏళ్ల జైలుశిక్ష..!!
- సుస్థిర భవిష్యత్తుకు బహ్రెయిన్‌లో కొత్త కేంద్రం..!!
- ఫ్లైదుబాయ్ ఘటన పై ఇజ్రాయెల్ తీవ్ర వ్యాఖ్యలు
- యూఏఈలో ఇన్వెస్ట్మెంట్ మోసాలపై కీలక హెచ్చరిక







