కరోనా థర్డ్‌వేవ్ ఎదుర్కొనేందుకు WHO సూచనలివీ
- June 21, 2021
జెనీవా: కరోనా మహమ్మారి మరో వేవ్ రూపంలో విరుచుకుపడకుండా ఏం చేయాలి..కరోనా థర్డ్‌వేవ్ ముప్పు ఎలా ఉండబోతోంది. వైరస్ ముప్పు ఇతర దేశాల్లో ఎలా ఉంది.WHO ఏం చెబుతోంది.
కరోనా సెకండ్ వేవ్ ముప్పు ఇంకా పూర్తిగా తొలగలేదు. కరోనా థర్డ్‌వేవ్ ముప్పు ఆందోళన కల్గిస్తోంది. మరో వేవ్ విరుచుకుపడకుండా ఉండేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ కొన్ని సూచనలు చేస్తోంది. ముఖ్యంగా ఆగ్నేయాసియా దేశాల్ని ఉద్దేశించి పేర్కొంది. మరో వేవ్ బారిన పడకుండా ఉండాలంటే ప్రజారోగ్య రంగంలో మౌళిక సదుపాయాల్ని పెంచుకోవాలని సూచించింది. కరోనా నియంత్రణ చర్యల్ని కచ్చితంగా అమలు చేయాలని..వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని తెలిపింది. మాల్డీవ్స్, మయన్మార్‌లో ప్రమాదకరమైన కరోనా వేరియంట్లు విస్తరిస్తున్నాయని స్పష్టం చేసింది.
బంగ్లాదేశ్, ఇండియా, ఇండోనేషియా, నేపాల్, శ్రీలంక, థాయ్‌లాండ్ వంటి దేశాల్లో ఇటువంటి వేరియంట్లే భయభ్రాంతుల్ని చేశాయని గుర్తు చేసింది. దెబ్బతిన్న ఆర్ధిక వ్యవస్తను తిరిగి గాడిన పెట్టే కారణంతో కరోనా నియంత్రణ చర్యల్ని ప్రభుత్వాలు గాలికొదిలేశాయన్నారు. ప్రభుత్వాలు ఆంక్షల్ని సడలించాయని..అటు ప్రజలు కూడా జాగ్రత్తలు మర్చిపోయారని డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది. టెస్ట్, ట్రేస్, ఐసోలేట్ చర్యల్ని నిరంతరం కొనసాగించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. సామాజిక దూరం, చేతులు శుభ్రపర్చుకోవడం, మాస్కులు సక్రమంగా ధరించడం వంటి జాగ్రత్తల్ని కచ్చితంగా పాటించాలంటోంది. వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతున్నప్పటికీ కరోనా నియంత్రణ చర్యలు చేపట్టాలని తెలిపింది. కొన్ని దేశాల్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని హెచ్చరించింది. పాజిటివ్ కేసులు అనూహ్యంగా పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది.
తాజా వార్తలు
- రికార్డు సృష్టించిన రోనాల్డో
- త్వరలో 190 కొత్త అంబులెన్స్‌లు ప్రారంభం: మంత్రి సత్యకుమార్
- సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్టు..!!
- యూఏఈ గోల్డెన్ వీసా హోల్డర్లకు కాన్సులర్ సేవలు..!!
- ప్రైవేట్ రంగంలో విదేశీ కార్మికుల నియామకంపై నిషేధం..!!
- సిద్రా మెడిసిన్‌లో ‘హీలింగ్ నోట్స్’ ప్రారంభం..!!
- SR21 మిలియన్ల విలువైన 39వేల రిజిస్ట్రేషన్లు రద్దు..!!
- సహామ్‌లో 7వేల సైకోట్రోపిక్ పిల్స్ స్వాధీనం..!!
- Android 16 ఆధారిత కొత్త అప్డేట్ వివరాలు
- విలువైన బిట్‌కాయిన్ సీజ్ చేసిన అమెరికా