మరోసారి వాయిదా పడిన స్పుత్నిక్ సెకండ్ డోసు షెడ్యూల్
- June 21, 2021
బహ్రెయిన్: కోవిడ్ వ్యాక్సిన్ స్పుత్నిక్ సెకండ్ డోస్ కోసం లబ్ధిదారులు మరికొంత కాలం వేచి చూడక తప్పనిసరి పరిస్థితి నెలకొంది. ఈపాటికి అందాల్సిన కొత్త బ్యాక్ వ్యాక్సిన్ డోసులు ఇంకా దేశానికి చేరకపోవటంతో సెకండ్ డోస్ షెడ్యూల్ ను రీషెడ్యూల్ చేస్తున్నట్లు బహ్రెయిన్ ప్రకటించింది. దీంతో ఫస్ట్ డోస్ తీసుకొని సెకండ్ డోస్ కోసం రిజిస్టర్ చేసుకున్న వారు మరికొద్ది రోజులు వేచి ఉండాల్సిందే. ముందస్తుగా చేసుకున్న ఒప్పందం మేరకు స్పుత్నిక్ తయారీ సంస్థ నుంచి తగిన మోతాదులో డోసులు బహ్రెయిన్ కు చేరలేదని అధికారులు వెల్లడించారు. అయినా..తొలి డోస్ తీసుకున్న వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రెండు డోసుల మధ్య గడువు పెరిగటం వల్ల కూడా తొలి డోసు సమర్ధత ఇంకా మెరుగుపడుతుందని చెబుతున్నారు. కంపెనీ నుంచి కొత్త బ్యాచ్ వ్యాక్సిన్ డోసులు రాగానే బీఅవేర్ యాప్ ద్వారా సెకండ్ డోస్ సమయాన్ని రీషెడ్యూల్ చేయనున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- ఆస్కార్ రేసులో సౌదీ 'హిజ్రా' సినిమా..!!
- ఒమన్ లో పర్యావరణ పరిరక్షణకు ప్రోత్సాహం..!!
- యూఏఈ వెదర్ అలెర్ట్.. భారీ వర్షాలు..వరదలు..!!
- ఖతార్ లో 'టాన్నౌరిన్' బాటిల్ వాటర్ ఉపసంహరణ..!!
- బహ్రెయిన్ లో జోరుగా నేషనల్ ట్రీ వీక్..!!
- పబ్లిక్ ప్లేస్ లో న్యూసెన్స్..పలువురు అరెస్టు..!!
- ప్రధాని మోదీ సభ పై కూటమి ఫోకస్
- Wi-Fi 8 పరిచయం
- ఘరఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ అండర్పాస్ మూసివేత..!!
- మాదకద్రవ్యాలను కలిగి ఉన్న పది మంది అరెస్టు..!!