కోవిడ్ 19 యాక్టివ్ కేసుల చికిత్స కోసం తొలి క్లినిక్ ప్రారంభించిన బహ్రెయిన్

- June 22, 2021 , by Maagulf
కోవిడ్ 19 యాక్టివ్ కేసుల చికిత్స కోసం తొలి క్లినిక్ ప్రారంభించిన బహ్రెయిన్

బహ్రెయిన్: అల్ షామిలి మెడికల్ సెంటర్ వద్ద కోవిడ్ 19 యాక్టివ్ కేసులకు వైద్య చికిత్స అందించేందుకోసం స్పెషలైజ్డ్ క్లినిక్ ప్రారంభించడం జరిగింది. సోట్రోవిమాబ్ అలాగే మోనోక్లోనల్ యాంటీ బాడీస్ వృద్ధి చేసే మందుల్ని ఉపయోగించి ఇక్కడ వైద్య చికిత్స అందిస్తారు. ఈ సందర్భంగా మినిస్టర్ మాట్లాడుతూ, బహ్రెయిన్ అనుభవాల్ని జిఎస్కే డెలిగేషన్ జాగ్రత్తగా పరిశీలిస్తోందని చెప్పారు. ఇంట్రా వీనస్ విధానంలో సోట్రోవిమాబ్ మెడిసిన్ కరోనా బాధితులకు అందిస్తారు. కేవలం ప్రభుత్వ ఆసుపత్రుల్లో మాత్రమే ఇది అందుబాటులో వుంటుంది. అత్యవసర వినియోగం కింద ఈ మందుని బహ్రెయిన్ నేషనల్ హెల్త్ రెగ్యులేటరీ అథారిటీ ఆమోదించింది. జిఎస్కే (గ్లాస్కో స్మిత్ క్లైన్) ఈ మందుని తయారు చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com