అబుధాబిలో అదృశ్యమైన తెలంగాణ వాసి
- June 26, 2021
యూఏఈ: తెలంగాణలోని జగిత్యాల జిల్లా మేడిపెల్లి మండలం మన్నెగూడెంకు చెందిన శ్రీరాముల హరిప్రసాద్ (40) ఊళ్లోనే టీ స్టాల్ నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు.అతడికి భార్య నీరజతో పాటు పవన్ (9), రక్షిత (7) ఇద్దరు పిల్లలున్నారు.పిల్లలు ఎదుగుతుండటంతో కుటుంబ పోషణ కష్టంగా మారింది.అయినప్పటికీ పిల్లలను ఉన్నత చదువులు చదివించి ప్రయోజకులను చేయాలని ఆశ పడ్డాడు.గల్ఫ్ వెళ్లాలని నిర్ణయించుకొని,అబుధాబిలో హోటల్లో పనికోసం రూ.2 లక్షలు చెల్లించి గత ఏడాది డిసెంబర్ 27న అక్కడికి వెళ్లాడు. కరోనా నిబంధనల ప్రకారం కంపెనీ వారు హరిప్రసాద్‌ను 10 రోజులపాటు క్వారంటైన్లో ఉంచారు. జనవరి 5న కంపెనీ కేటాయించిన రూములోకి మారాడు. రూల్స్ ప్రకారం మెడికల్ టెస్టులు చేయించి జనవరి 19 నుంచి పనికి రావాలని కంపెనీ యాజమాన్యం తెలిపింది.
అయితే జనవరి 18న చిన్న పని ఉందని తనతో రూమ్‌లో ఉన్నవారికి చెప్పి బయటకు వెళ్లిన హరిప్రసాద్ అదృశ్యమయ్యాడు.ఇంతవరకు ఆచూకీ లభ్యం కాలేదు. తన భర్త అబుధాబి వెళ్లి ఫోన్ చేయకపోవడంతో భర్త పనికి కుదిరిన ప్రాంతంలో ఉన్న బంధువులకు ఫోన్ చేసి విషయం చెప్పింది నీరజ.వారు అక్కడికి వెళ్లి చూడగా హరిప్రసాద్ ఫోన్‌తోపాటు లగేజీ కూడా రూములోనే ఉన్నాయి. కంపెనీ వారు సైతం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు వారు వెల్లడించారు. హరిప్రసాద్ ఇంటి నుంచి వెళ్లి ఆరు నెలలు అవుతున్నా భార్య, ఇతర కుటుంబ సభ్యులకు ఫోన్ చేయకపోవడంతో ఆందోళన చెందుతున్నారు.తన భర్తను ఇంటికి రప్పించేలా చూడాలని భార్యా పిల్లలు చేతులు జోడించి వేడుకుంటున్నారు.హరిప్రసాద్ ఆచూకీ తెలిసిన వారు యూఏఈ నంబర్ 0569803484 కు కాల్ చేసి తెలుపగలరు.
తాజా వార్తలు
- శోభాయాత్ర ప్రశాంతంగా సాగేలా ఏర్పాటు చేస్తున్నాం: సీపీ సజ్జనార్
- రోహిత్ రెడ్డికి 3 రోజుల పోలీస్ కస్టడీ..కోర్టు కీలక ఆదేశాలు!
- యుద్ధం పై ట్రంప్ కీలక ప్రకటన.. 5 రోజులు బ్రేక్
- ఏపీలో మెగా స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు
- దుబాయ్‌కు జజీరా ఎయిర్వేస్ విమాన సర్వీసులు పునఃప్రారంభం
- మూడు జోన్లుగా భాగ్యనగరం..సీఎం రేవంత్
- భూ మార్గాల ద్వారా కార్గో మళ్లింపు..కువైట్ కస్టమ్..!!
- ఖతార్ నేషనల్ లైబ్రరీ రీ ఓపెన్..టైమింగ్స్ ఇవే..!!
- రష్యన్ ఉప విదేశాంగ మంత్రితో బహ్రెయిన్ రాయబారి భేటీ..!!
- యూఏఈలో పెట్రోల్ ధరలు ఎంత మేర పెరగవచ్చు?









