కోవిడ్ రిలీఫ్ కోసం కేంద్రం చర్యలు..
- June 28, 2021
న్యూ ఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసేందుకు కేంద్రం కొత్త చర్యలు ప్రకటించింది.కోవిడ్ రిలీఫ్ కోసం చర్యలు తీసుకుంటున్నట్టు పేర్కొంది. ఇందుకోసం 8 ఆర్థిక ఉపశమన చర్యలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. సోమవారంనాడు మీడియాతో మంత్రి మాట్లాడుతూ, ఎనిమిది ఆర్థిక ఉపశమన చర్యల్లో నాలుగు పూర్తిగా కొత్తవని, ఒకటి హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు సంబంధించినదని చెప్పారు. కోవిడ్ బాధిత ప్రాంతాల కోసం రూ.1.1 లక్షల కోట్ల రుణ హామీ పథకం (క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్), ఆరోగ్య రంగానికి రూ.50,000 కోట్లు కేటాయిస్తున్నామని చెప్పారు. వైద్య, ఆరోగ్య రంగానికి సేవలందించే సంస్థలకు చేయూతనిస్తామని అన్నారు.
క్రెడిట్ గ్యారెంట్ స్కీమ్ అనేది కొత్త పథకమని, ఇందువల్ల 25 లక్షల మంది లబ్ధి పొందుతారని నిర్మలా సీతారామన్ తెలిపారు. చిన్న చిన్న రుణాలు తీసుకునే వారికి మెక్రో ఫైనాన్స్ సంస్థల ద్వారా రుణాలు ఇస్తామని, గరిష్టంగా రూ.1.25 లక్షల వరకూ రుణం ఇస్తామని అన్నారు. పాత రుణాల వసూళ్లపై కాకుండా కొత్త రుణాలపై ప్రధానంగా దృష్టి సారిస్తామని చెప్పారు. చిన్న పట్టణాలతో పాటు మారుమాలు ప్రాంతాలకు కూడా ఈ పథకాన్ని తీసుకు వెళ్తామని మంత్రి తెలిపారు. న్యూ క్రెడిట్ గ్యారెంట్ స్కీమ్ కింద వడ్డీ రేటు 2 శాతంగా ఉంటుందని, ఇది ఆర్బీఐ నిర్దేశించిన వడ్డీ రేటు కంటే తక్కువని చెప్పారు. రుణాల చెల్లింపునకు మూడేళ్ల కాలపరిమితి ఉంటుందని తెలిపారు.
తాజా వార్తలు
- మహిళా రిజర్వేషన్ల బిల్లులో ఓబీసీ సబ్ కోటా తప్పనిసరి: కల్వకుంట్ల కవిత
- యురేనియం నిల్వల గురించి లోక్ సభలో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- ఇరాన్‌కు అమెరికా పలు కీలక ప్రతిపాదనలు..అందులో ఏమున్నాయంటే?
- ఈయూ పార్లమెంట్ అధ్యక్షురాలితో జీసీసీ రాయబారులు భేటీ..!!
- యూఏఈలో భారీ వర్షాలు, వడగళ్ళు..హెచ్చరికలు జారీ..!!
- జాతీయ భద్రతపైనే ఫోకస్..అమెరికా-ఇరాన్ చర్చల్లో నో రోల్..!!
- హైదరాబాద్‌లో పెట్రోల్, డీజిల్ కొరత లేదు: సీపీ సజ్జనార్
- కువైట్ ఎయిర్పోట్ ఫ్యుయల్ ట్యాంక్ పై డ్రోన్ దాడి..!!
- IRCTCలో 3 కోట్ల ఫేక్ ఖాతాలు: రైల్వే మంత్రి
- ఒమన్ వ్యాప్తంగా 93 మందికి ఆశ్రయం..!!









