తెలంగాణ: విదేశాలకు వెళ్లే ఉద్యోగులకు వ్యాక్సిన్‌..

- June 28, 2021 , by Maagulf
తెలంగాణ: విదేశాలకు వెళ్లే ఉద్యోగులకు వ్యాక్సిన్‌..

తెలంగాణ: వ్యాక్సిన్‌ నేషన్‌ ప్రక్రియ వేగవంతంగా సాగుతోంది.. ప్రాధాన్యత ప్రకారం వ్యాక్సినేషన్‌ చేస్తూ వస్తోంది తెలంగాణ ప్రభుత్వం.. ఇప్పటికే చదువుల కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థులకు వ్యాక్సిన్‌ ఇస్తుండగా..ఇప్పుడు విదేశాలకు ఉద్యోగాల కోసం వెళ్లే వారికి వ్యాక్సిన్‌పై గైడ్‌లైన్స్ విడుదల చేశారు.. ఉద్యోగ అవసరాలపై విదేశాలకు వెళ్లే వారికి వ్యాక్సిన్ వేయాలని నిర్ణయించినట్టు ప్రకటించింది ఆరోగ్య శాఖ.. విదేశాలకు ఉద్యోగం కోసం వెళ్లేవారు పాస్ పోర్ట్, వర్క్ పర్మిట్ వీసాలను చూపించి ప్రభుత్వ వ్యాక్సిన్ కేంద్రాల్లో వ్యాక్సిన్‌ పొందవచ్చని ఆరోగ్య శాఖ వెల్లడించింది.. అర్హులైన వారికి కోవిషీల్డ్‌ టీకాలను 28 రోజుల వ్యవధిలో రెండు డోసులు ఇవ్వనున్నట్టు ప్రకటించింది ప్రభుత్వం…అంతేకాదు.. విదేశాలకు వెళ్లే ఉద్యోగస్తుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 10 వ్యాక్సిన్‌ కేంద్రాలను కేటాయించింది వైద్య ఆరోగ్య శాఖ.

 వ్యాక్సిన్‌ కేంద్రాల వివరాలు...

ఆదిలాబాద్-పిపి యూనిట్ రిమ్స్ 
నిజామాబాద్-యుపీహెచ్సి వినాయక్ నగర్  
కరీంనగర్-యుపీహెచ్సి బుట్టరాజారాం కాలనీ 
వరంగల్-యుపీహెచ్సి లక్సర్ సింగారం 
ఖమ్మం-యుపీహెచ్సి వెంకటేశ్వర్ నగర్ 
మెదక్-యుపీహెచ్సి మెదక్ 
మహబూబ్ నగర్-యుపీహెచ్సి రామయ్య బౌలీ 
నల్గొండ-యుపీహెచ్సి పంగల్
రంగ రెడ్డి-యుపీహెచ్సి సరూర్ నగర్ 
హైదరాబాద్-యుపీహెచ్సి,ఆర్టిఎఫ్సి యుపీహెచ్సి తరమైదాన్

 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com