ఒమన్ లో 3000 దాటిన కోవిడ్ మృతుల సంఖ్య
- June 29, 2021
మస్కట్: ఒమన్ లో రికార్డ్ స్థాయి కోవిడ్ కేసులు నమోదైన మరుసటి రోజే రికార్డ్ స్థాయిలో మరణాలు కూడా సంభవించాయి. గడిచిన 24 గంటల్లో కోవిడ్ బారిన పడి 45 మంది మృతి చెందినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. కోవిడ్ సమాచారం కోసం ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన తారస్సద్ యాప్ లో నమోదైన వివరాల ప్రకారం గత 24 గంటల్లో 197 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రస్తుతం ఒమన్‌లో 2,243 కోవిడ్ కేసులు ఉన్నాయి. ఇందులో 1,650 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా...506 మంది ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు మొత్తం 2,64,302 మంది కోవిడ్ బారిన పడగా...2,31,718 మంది రికవరీ అయ్యారు. 3,013 మంది మృతి చెందారు.
తాజా వార్తలు
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి
- యూరప్‌లో వైద్య నిపుణుల శిక్షణకు తుంబే గ్రూప్–రొమేనియా యూనివర్సిటీ భాగస్వామ్యం
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు
- నోబెల్ విజేతలకు రూ.11.52 కోట్లు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!
- అరేబియా గల్ఫ్‌లో 22 మంది సిబ్బందిని రక్షించిన యూఏఈ..!!
- పాస్‌పోర్ట్, రెసిడెన్సీ సేవల్లో సహకారానికి ఖతార్–యూఏఈ చర్చలు..!!







